IPL 2022 CSK WIN : ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ చమక్ చేస్తోంది. కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్సీలో చెలరేగిపోతున్నారు చెన్నై ఆటగాళ్లు. ఆల్ రౌండ్ షోతో అదరగొడుతూ వరుస విజయాలు నమోదు చేసుకుంటున్నారు. ఆదివారం ఢిల్లీని చిత్తు చేసింది ధోనీ టీమ్. భారీ విజయం నమోదు చేసుకుని ఢిల్లీ ప్లే ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సీజన్ లో నాలుగో విజయాన్ని సాధించిన చెన్నై.. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో  డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు తగ్గట్లుగా ఆడింది చెన్నై టీమ్. 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై తొలి నుంచే అదరగొట్టింది. ఓపెనర్లు డెవాన్ కాన్వె, రుతురాజ్ గైక్వాడ్ లు వీర బాదుడు బాదారు. ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నారు. పోటీ పోటీ మరీ సిక్సర్లు, బౌండరీలు బాదడంతో సీఎస్ కే స్కోర్ పరుగులు పెట్టింది. డెవానా కాన్వె 49 బంతుల్లో87 పరుగులు చేయగా.. ఈ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్న గెక్వాడ్ 41 రన్స్ చేశాడు. కాన్వే 27 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఓపెనర్లు తొలి వికెట్ కు 110 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన దూబే కూడా చివరలో చెలరేగాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోర్ చేసింది చెన్నై. ఢిల్లీ బౌలర్లలో ఎన్రిచ్ నోర్జె మూడు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు.


భారీ లక్ష్యచేధనలో ఢిల్లీ తొలి నుంచే తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోతూ 17.4 ఓవర్లలో కేవలం 117 పరుగులకే చాప చుట్టేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 25 పరుగలతో టాప్ స్కోరర్ గా నిలిచారు. శార్దూల్ ఠాకూర్ చివరలో ధాటీగా ఆడి 24 రన్స్ చేశాడు. ఢిల్లీ తరపున ఫస్ట్ మ్యాచ్ ఆడిన తెలుగు ప్లేయర్ కేఎస్ భరత్ 8 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీకి మూడు వికెట్లు రాగా... ముకేష్ చౌదరి రెండు వికెట్లు పడగొట్టాడు. సిమర్ జీత్ సింగ్, బ్రావోలు తలో రెండు వికెట్లు సాధించారు. సూపర్ బ్యాటింగ్ చేసిన డెవాన్ కాన్వే  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. ఢిల్లీపై విజయం చెన్నై ఖాతాలో నాలుగోది. 


READ ALSO: SRH vs RCB: ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ప్రతీకారం, 67 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం


READ ALSO: Yuzvendra Chahal: యజువేంద్ర చహల్ అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook