SRH vs RCB: ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ప్రతీకారం, 67 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం

SRH vs RCB: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి ఘోరంగా విఫలమైంది. వరుస విజయాల తరువాత ఇప్పుడు వరుస అపజయాలు ఎదుర్కొంటోంది. ఆర్సీబీపై ఘోరంగా ఓటమి పాలైంది. ప్లే ఆఫ్ అవకాశాలకు మరింత దూరమైంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2022, 07:35 PM IST
  • సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • ఎస్ఆర్‌హెచ్ మరో పరాజయం, 67 పరుగుల తేడాతో ఆర్సీబీపై ఓటమి
  • వరుసగా నాలుగవ ఓటమితో ప్లే ఆఫ్‌కు మరింత దూరమైన ఎస్ఆర్‌హెచ్
SRH vs RCB: ఎస్ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ప్రతీకారం, 67 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం

SRH vs RCB: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి ఘోరంగా విఫలమైంది. వరుస విజయాల తరువాత ఇప్పుడు వరుస అపజయాలు ఎదుర్కొంటోంది. ఆర్సీబీపై ఘోరంగా ఓటమి పాలైంది. ప్లే ఆఫ్ అవకాశాలకు మరింత దూరమైంది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ మరోసారి గోల్డెన్ డకౌట్ అయి వెనుదిరిగాడు. సుచిత్ మొదటి బంతికే విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చేశాడు. ప్రారంభంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశారు. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 1 వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. అక్కడి నుంచి ఆర్సీబీ బ్యాటర్లు డుప్లెసిస్, పటిదార్‌లు ధాటిగా ఆడటం ప్రారంభించారు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్ ఏకంగా 20 పరుగులు సమర్పించుకోవల్సిన పరిస్థితి. పదకొండో ఓవర్ ముగిసేసరికి..ఆర్సీబీ 98 పరుగులకు చేరుకుంది. ఆ తరువాత డుప్లెసిస్ 38 బంతుల్లో 51 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 17 ఓవర్లు ముగిసేసరికి కూడా ఆర్సీబీ స్కోరు 2 వికెట్ల నష్టానికి 145 పరుగులే. కానీ చివరి 3 ఓవర్లు ఎస్ఆర్‌హెచ్‌కు భారంగా మారాయి. ముఖ్యంగా ఫరూఖీ వేసిన ఆఖరి ఓవర్లో దినేష్ కార్తీక్ 25 పరుగుల సాధించి..ఆర్సీబీ భారీ స్కోరుకు కారణమయ్యాడు

ఇక 193 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే భారీ మూల్యం చెల్లించుకోవల్సిన పరిస్థితి. మొదటి ఓవర్ మొదటి బంతికే కేన్ విలియమ్సన్..రనౌట్ అయ్యాడు. ఇక ఇటీవల మంచి ఫామ్ కనబరుస్తున్న అభిషేక్ శర్మ సైతం మ్యాక్స్‌‌వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. ఆ తరువాత త్రిపాఠీ , మర్‌క్రమ్ కాస్త నిలకడగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నాలు చేశారు. మర్‌క్రమ్ స్థిరపడి ఆడుతున్నాడనుకునేంతలో మరో షాక్ తగిలింది ఎస్ఆర్‌హెచ్ జట్టుకు. మర్‌క్రమ్ 21 పరుగులు చేసి...హసరంగా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక ఆ తరువాత పూరన్, త్రిపాఠీలు కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టేందుకు ప్రయత్నించారు. 90 పరుగుల వద్ద ఎస్ఆర్‌హెచ్ నాలుగోవికెట్ పూరన్‌ను కోల్పోయింది. ఇక ఆ తరువాత వరుసగా వికెట్ల పతనం ప్రారంభమైంది. 16వ ఓవర్ ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత 17వ ఓవర్ ప్రారంభంలో వరుసగా మరో రెండు వికెట్లు కోల్పోయింది. 16.4 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఇక చివరి ఓవర్ తొలిబంతిలో చివరి వికెట్ కూడా పడటంతో ఆలవుట్ అయింది. 67 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్ హసరంగా అద్భుతంగా బౌల్ చేసి 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

Also read: Yuzvendra Chahal: యజువేంద్ర చహల్ అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News