IPL 2022: Daniel Vetteri feels Hardik Pandya, KL Rahul might play for same team: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 రిటెన్షన్ ప్రక్రియ తాజాగా ముగిసిన విషయం తెలిసిందే. చాలా జట్లు నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. కొన్ని జట్లు మాత్రం ముగ్గురిని తీసుకున్నాయి. ఐదుసార్లు చాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) నలుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకుంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ, .ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌, స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రాలను మాత్రమే రిటైన్‌ చేసుకుంది. అయితే జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)ను మాత్రం ముంబై ఇండియన్స్‌ వదిలేసింది. ఇది అందరికి ఆశ్చర్యం కలిగించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2015లో కనీస ధర రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya)ను కొనుగోలు చేసింది. ఎన్నోసార్లు ఒంటిచేత్తో జట్టుకు విజయాలనందించి జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో తన మార్క్ చూపించాడు. ఈ క్రమంలోనే ముంబై నాలుగు ఐపీఎల్‌ టైటిళ్లు (2015, 2017, 2019, 2020) సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2019, 2020 సీజన్లో ముంబై టైటిల్‌ గెలవడంలో హార్దిక్‌ది కీలకపాత్ర. అయితే గత కొన్నాళ్లుగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న హార్దిక్‌.. టీమిండియా (Team India)లో చోటు కోల్పోయాడు. టీ20 ప్రపంచకప్‌ 2021కు ఆల్‌రౌండర్‌గా ఎంపికైనప్పటికి.. ఒక్క మంచి ప్రదర్శన చేయలేదు. దీంతో అతడు జట్టులో చోటు కోల్పోయాడు. ఇక ఇప్పుడు ముంబై టీంలో కూడా లేకుండా పోయాడు. 


Also Read: Travel History లేని బెంగళూరు వైద్యుడికి ఒమిక్రాన్‌.. భయాందోళనలో భారత్! ఇంతకీ ఎలా సోకింది?


అయితే ముంబై ఇండియన్స్ జట్టుని విడిచిపెట్టడం హార్దిక్ పాండ్యా స్వంత నిర్ణయం కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు న్యూజీలాండ్ మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కోచ్ డానియల్ వెటోరి (Daniel Vetteri). ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో వెటోరి మాట్లాడుతూ... 'బహుశా హార్దిక్ పాండ్యా తనను తాను మెరుగుపరుచుకోవడానికి ముంబై ఇండియన్స్ జట్టును వీడి ఉండొచ్చు. ఏదైనా కమిట్మెంట్ కోసం కూడా ముంబైతో కొనసాగకపోవడానికి ఒక కారణం కావచ్చు. కేఎల్ రాహుల్ (KL Rahul) మరియు హార్దిక్ చాలా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి అదృష్టం కలిసొస్తే ఇద్దరు ఒక జట్టుకే కలిసి ఆడే అవకాశం ఉంది' అని అన్నాడు. వచ్చే సీజన్లో చాలా మంది ప్లేయర్స్ కలిసి ఆడటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డాడు. 


Also Read: Pushpa Trailer: సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ ట్రెండింగ్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ కట్ పిక్స్


పంజాబ్‌ కింగ్స్‌ (PBKS) కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ (KL Rahu) అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. గత కొన్ని సీజన్లుగా రాహుల్ 500లకు పైగా పరుగులు చేశాడు. క్యాచ్ రిచ్ టోర్నీలో ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో రాహుల్‌ 13 ఇన్నింగ్స్‌లో 626 పరుగులు చేశాడు. కింగ్స్‌ పంజాబ్‌ జట్టుతో కొనసాగడానికి రాహుల్ ఇష్టపడకపోవడంతో.. అతన్ని ఆ ప్రాంచైజీ వదిలేసింది. వచ్చే వేలంలో అతడికి భారీ మొత్తం దక్కే అవకాశం ఉంది. దాదాపు 20 కోట్లు దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త ప్రాంచైజీ లక్నో అతడిని దక్కించుకునేందుకు ఆసక్తిగా ఉందట. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook