Nehra - Hardik: హార్దిక్ పాండ్యా చెప్పేవన్ని అబద్దాలే.. నేనేమి చేయలేదు: ఆశిష్ నెహ్రా
Hardik Pandya says lie said Gujarat Titans head coach Ashish Nehra. ఐపీఎల్ 2022 విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఆ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాతో కలిసి సరదాగా చేసిన చిట్ చాట్ వీడియో ఒకటి వైరల్ అయింది.
Gujarat Titans head coach Ashish Nehra, Captain Hardik Pandya funny banter goes viral: అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్ 2022 ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తుచేసి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. లీగ్ ఆరంభం నుంచి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సత్తాచాటి.. లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలిసారే కప్ కొట్టి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఫైనల్లో ముందుగా రాయల్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడిచేసి.. ఆపై బ్యాటింగ్‌లో సత్తాచాటింది. అయితే విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఆ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాతో కలిసి సరదాగా చేసిన చిట్ చాట్ వీడియో ఒకటి వైరల్ అయింది.
వీడియోలో హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా ఐపీఎల్ ప్రధానోత్సవ వేదికపై కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. ముందుగా హార్దిక్ మాట్లాడుతూ... 'మనం అరంగేట్ర సీజన్‌లోనే సిక్స్ కొట్టాం. మనం ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలిచాం. జట్టులోకి ప్రతిఒక్క ఆటగాడి ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. లీగ్ ఆరంభానికి ముందు చాలా మంది గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ బలంగా లేవని చాలా రకాల కామెంట్స్ చేశారు. కానీ మనం ఇప్పుడు టైటిల్ గెలిచాం. నిజంగా ఇది చాలా బాగుంది కదా. ఆ దేవుడి దయతో అంతా మంచే జరిగింది' అని అన్నాడు.
అనంతరం ఆశిష్ నెహ్రాపై హార్దిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. 'గుజరాత్ టైటాన్స్‌లో మొదట ప్రాక్టీసుకు వెళ్లేది ఆశిష్ నెహ్రా. 20 నిమిషాల సమయం ఉన్నా.. ప్రాక్టీసు అయిపోయినా మళ్లీమళ్లీ బ్యాటింగ్ చేయమంటారు. నిజానికి ఈ విజయం క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది. జట్టు కోసం అంకితభావంతో పనిచేశారు. ప్రతి ఒక్కరు హార్డ్‌వర్క్ చేసేలా ప్రోత్సహించారు' అని పేర్కొన్నాడు. హార్దిక్ మాటలకు స్పందించిన నెహ్రా.. ఇదంతా అబద్ధం అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
'గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, టీమ్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి ఇద్దరు జట్టు కోసం ఎంతో కష్టపడ్డారు. ఐపీఎల్ 2022 వేలం రోజు నుంచి విజేతగా నిలిచే వరకు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. బ్యాటింగ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్ ఉన్నా.. నిర్ణయాత్మక పాత్ర మాత్రం ఈ ఇద్దరిదే. చాలా మంది కోచ్‌లతో పోలిస్తే పూర్తి భిన్నమైన శైలితో నెహ్రా పని చేశాడు. అందరి కోచ్‌ల తరహాలో చేతిలో పెన్నూ, పేపర్‌తో నోట్స్ రాసుకోకుండా.. తాను చెప్పదల్చుకున్న అంశంను ఆటగాళ్లకు నేరుగా చెప్పేవాడు. ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు.
Also Read: Hardik Pandya Celebrations: వైరల్ వీడియో.. భావోద్వేగాన్ని ఆపుకోలేక భార్యను గట్టిగా.!
Also Read: IPL 2022 Awards List: ఐపీఎల్ 2022 అవార్డు విజేతలు వీరే.. ఆ ఐదు అవార్డులు జోస్ బట్లర్‌కే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook