IPL 2022 Final in Ahmedabad is set to become Most Attended Cricket Match in world: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) 15వ సీజన్‌ మెగా ఫైనల్‌ ఆదివారం (మే 29) ముగిసింది. ఐపీఎల్ 2022 టైటిల్‌ను కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ 7 వికెట్ల తేడాతో గెలుపొంది అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ ఎగరేసుకుపోయింది. మరోవైపు 14 ఏళ్ల తర్వాత తుది పోరుకు అర్హత సాధించిన రాజస్తాన్‌కు భంగపాటు తప్పలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌​కు మొత్తం 1,10,000 మంది ప్రేక్షకులు హాజరైనట్లు సమాచారం తెలుస్తోంది. దాంతో భారత్‌లో అత్యధిక ప్రేక్షకులు హాజరైన క్రికెట్‌ మ్యాచ్‌గా ఐపీఎల్‌ 2022 ఫైనల్‌ రెకార్డులోకి ఎక్కింది. అంతేకాదు ప్రపంచంలో ఎక్కడైనా.. ఏదైనా వైట్-బాల్ క్రికెట్ మ్యాచ్‌కి అత్యధిక ప్రేక్షకులు వచ్చిన మ్యాచ్ కూడా ఇదే. అహ్మదాబాద్‌లో రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్ 2కి 85,000 మంది అభిమానులు హాజరయ్యారు. 


1993లో ఈడెన్ గార్డెన్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వైట్-బాల్ మ్యాచుకు ఒక లక్ష్యకు పైగా అభిమానులు హాజరయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు అత్యధికంగా ప్రేక్షకులు హాజరైన వైట్-బాల్ గేమ్‌గా భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ నిలిచింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ ఉంది. 


ఐపీఎల్‌ ముగింపు వేడుకల్లో భాగంగా బీసీసీఐ అతిపెద్ద జెర్సీని రూపొందించి.. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్‌ 2022 సందర్భంగా బీసీసీఐ అరుదైన జెర్సీని రూపొందించింది. పది జట్ల లోగోలతో పాటు ఐపీఎల్‌ 2022 అనే అక్షరాలతో 66 మీటర్ల పొడవు, 42 మీటర్ల వెడల్పుతో ఉంది. 


Also Read: IPL 2022 Final Fixing: ఒక్క సిక్సూ కొట్టని స్టార్ ప్లేయర్.. ఐపీఎల్ 2022 ఫైనల్ ఫిక్స్ అయిందా?


Also Read: Mahesh Babu: సినిమా టికెట్ కోసం క్యూలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, వీడియో వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook