KKR vs MI: టాస్ గెలిచిన కోల్‌కతా.. సూర్య వచ్చేశాడు! ముంబై బోణి కొట్టేనా?
KKR vs MI Toss: Kolkata Knight Riders opt to bowl. పూణేలోని ఎంసీఏ స్టేడియలో ముంబైతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IPL 2022, KKR vs MI Toss: Surykumar Yadav comes in place of Anmolpreet Singh: ఐపీఎల్ 2022లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. పూణేలోని ఎంసీఏ స్టేడియలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్లు శ్రేయాస్ వెల్లడించాడు. న్యూజిల్యాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ స్థానంలో ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. శివమ్ మావి స్థానంలో రసిఖ్ జట్టులోకి వచ్చాడు.
ముంబై కూడా రెండు మార్పులతో బరిలో దిగుతున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్ప్పాడు. అన్‌మోల్ ప్రీత్‌సింగ్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రాగా.. ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ వచ్చాడు. ఐపీఎల్ 2022లో భారీ అంచనాలతో బరిలో దిగిన ముంబై పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన రోహిత్ సేన.. కోల్‌కతా ఎలాగైనా పైచేయి సాధించి గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే, వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్, ఆండ్రి రస్సెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రసిఖ్ సలామ్.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డెవాల్డ్ బ్రెవిస్, డానియల్ శామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, బసిల్ థంపి, జస్‌ప్రీత్ బుమ్రా.
Also Read: Coronavirus XE Variant: భారత్‌లో కొత్త వేరియంట్ కలకలం.. ముంబైలో తొలి కేసు నమోదు!
Also Read: Rohit Sharma: మరో 54 పరుగులే.. రోహిత్ శర్మను ఊరిస్తున్న అరుదైన రికార్డు! రెండో క్రికెటర్‌గా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook