Ipl 2022 match 7: ఐపీఎల్‌ లో గురువారం రెండు కీలక జట్ల మధ్య పోరు జరగనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో.. లక్నోసూపర్‌ జెయింట్స్‌ తలపడనుంది. ఈ రెండు టీంలు కూడా ఇప్పటికే ఆడిన తొలి మ్యాచ్‌ లో ఓటమిపాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌ లో కచ్చితంగా గెలిచి బోణి కొట్టాలని రెండు జట్లు కూడా తాపత్రయపడుతున్నాయి.
ఐపీఎల్‌ 15వ ఎడిషన్‌ మ్యాచ్‌ లు ఇంట్రెస్టింగ్‌ గా జరుగుతున్నాయి. గురువారం లక్నో సూపర్‌ జెయింట్స్‌ తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంలోని లక్నో టీం.. చెన్నై జట్టుతో పోరుకు సిద్ధమైంది. గురువారం రాత్రి ఏడున్నరకు బ్రాబౌర్న్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. రెండు జట్లు కూడా తొలి మ్యాచ్‌ లో ఓటమిపాలయ్యాయి. ఈ మ్యాచ్‌ లో గెలిచేందుకు జడేజా నేతృత్వంలోని సీఎస్‌కే, లక్నో జట్లు ప్రాక్టీస్‌ ను ముమ్మరం చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌.. కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌ లో చెన్నై బ్యాట్స్‌ మెన్‌ లు చేతులెత్తేశారు. ధోనీ, జడేజా, ఊతప్ప మినహా ఎవరూ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. ఇక బౌలింగ్‌ పరంగా చూసినా.. ఆ మ్యాచ్‌ లో ఆరుగురు బౌలింగ్ చేశారు. అయితే బ్రావో, మిచెల్‌ సాంట్‌నర్‌ తప్ప మరెవ్వరూ వికెట్లు తీయలేకపోయారు. గురువారం జరిగే మ్యాచ్‌ లో చెన్నై జట్టు కొన్ని మార్పులు చేసే అవకాశం లేకపోలేదు.


ఇక లక్నో సూపర్‌ జెయింట్స్‌ పై గుజరాత్‌ టైటాన్స్‌ తొలి మ్యాచ్‌ లోనే విజయం సాధించింది. మరొ కొత్త టీం అయిన గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో రాహుల్‌ సేన.. ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌ లోనే కెప్టెన్‌ రాహుల్‌.. డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డికాక్‌, లూయిస్‌, మనీష్‌ పాండే కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. కేవలం దీపక్‌ హూడా, అయుష్‌ బదోని, కృణాల్‌ పాండ్యా ఆడటం వల్లే జట్టు ఆమాత్రం స్కోరు సాధించింది. అటు బౌలింగ్‌ విభాగంలో షమీరా, అవేశ్‌ ఖాన్‌, రవి బిష్ణోయ్‌ లతో బలంగా కనిపిస్తున్నప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో ఫెయిల్‌ అయ్యారు. దాని ఫలితంగానే లక్నో తోలి మ్యాచ్‌ లో ఓటమిచవిచూడాల్సి వచ్చింది. మరీ గురువారం జరిగే ఫ్రెండ్లీ ఫైట్‌ లో విజయం లక్నోదా.. లేక చెన్నైదా వేచి చూడాలి.


Also Read: Video: జై శ్రీరామ్ అంటే బాగుపడరు... దుమారం రేపుతోన్న ఎమ్మెల్యే రాజయ్య కామెంట్స్


Also Read: Axis bank: యాక్సిస్ చేతికి సిటీగ్రూప్​ రిటైల్ వ్యాపారాలు - డీల్​ విలువ ఎంతంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook