Video: జై శ్రీరామ్ అంటే బాగుపడరు... దుమారం రేపుతోన్న ఎమ్మెల్యే రాజయ్య కామెంట్స్

MLA Rajaiah controversial comments:టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జై శ్రీరామ్ అంటే దళితులు బాగుపడరని... జై కేసీఆర్ అంటేనే బాగుపడుతారని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2022, 06:22 PM IST
  • దుమారం రేపుతోన్న ఎమ్మెల్యే రాజయ్య కామెంట్స్
  • జై శ్రీరామ్ అంటే దళితులు బాగుపడరన్న రాజయ్య
  • జై కేసీఆర్ అంటేనే బాగుపడుతారని కామెంట్
Video: జై శ్రీరామ్ అంటే బాగుపడరు... దుమారం రేపుతోన్న ఎమ్మెల్యే రాజయ్య కామెంట్స్

MLA Rajaiah controversial comments: టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జై శ్రీరామ్ అంటే దళితులు బాగుపడరని... జై కేసీఆర్ అంటేనే బాగుపడుతారని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జై శ్రీరామ్ కడుపు నింపుతాడా.. ఉపాధి కల్పిస్తాడా.. చదువునిస్తాడా.. బతుకుదెరువునిస్తాడా..' అని ప్రశ్నించారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో జరిగిన ఓ  కార్యక్రమంలో రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ హయాంలో దళితుల కోసం ఒక్క పథకమైనా తీసుకొచ్చారా రాజయ్య ప్రశ్నించారు. ఇక దళిత బంధు లబ్దిదారుల జాబితాలో తన సోదరుడి పేరు ఉండటం పట్ల వస్తున్న విమర్శలపై కూడా రాజయ్య స్పందించారు. తన కుటుంబంలోనూ ఇప్పటికీ పేదలు ఉన్నారని.. తన సొంత అక్కాచెల్లెళ్లకు ఇప్పటికీ ఇళ్లు కూడా లేవని అన్నారు. తన సొంత కుటుంబ సభ్యులు ఇప్పటికీ కంట్రోల్ బియ్యమే తింటున్నారని.. తన బంధువులైనంత మాత్రానా దళిత బంధు రావొద్దంటే ఎలా అని ప్రశ్నించారు.

జనగామ జిల్లాలో దళిత బంధు పథకానికి ఎంపిక చేసిన లబ్దిదారుల్లో రాజయ్య సోదరుడు సురేష్ పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దళిత బంధు పథకాన్ని వదులుకుంటున్నట్లు సురేష్ ప్రకటించారు. తన ఆర్థిక పరిస్థితి తెలిసే ఎమ్మెల్యే రాజయ్య తనను ఆ పథకానికి ఎంపిక చేశారని అన్నారు. రాజయ్యపై విమర్శలు రావొద్దనే ఉద్దేశంతో ఆ పథకాన్ని వదులుకుంటున్నట్లు తెలిపారు. 

రాజయ్యకు మాతృవియోగం...:

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి ల‌క్ష్మి (87) బుధవారం (మార్చి 30) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి హన్మకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(RMH)లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఆసుపత్రిలోనే ఆమె తుది శ్వాస విడిచారు. రాజయ్య తల్లి మృతి పట్ల మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, సత్యవతి రాథోడ్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజయ్య కుటుంబానికి సంతాపం ప్రకటించారు. 

Also Read: ఇక వేములవాడపై కేసీఆర్ ఫోకస్.. చిన జీయర్‌కు చెక్.. త్వరలో భారతీ తీర్థ స్వామి వద్దకు

RRR Latest Updates: 'ఆర్ఆర్ఆర్‌'కు అక్కడ ప్రేక్షకులు కరువు..! ఏకంగా షో క్యాన్సిల్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News