IPL 2022, MI vs RR Playing 11 Out: ఐపీఎల్ 2022లో భాగంగా ఈరోజు డబుల్ హెడర్స్  తెలిసిందే. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై జట్టులో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. మరోవైపు రాజస్థాన్ మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. కౌల్టర్-నైల్ స్థానంలో నవదీప్ సైనీ తుది జట్టులోకి వచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓటమితో ప్రారంభమైన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటోంది. ఇంతకుముందు ముంబై ఆడిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో విజయం సాధించాలని  కోరుకుంటోంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి జోరు మీదుంది.


పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ జట్టు సున్నా పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 25 మ్యాచ్‌లు జరగ్గా.. ముంబై 13, రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.



తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), అన్మోల్‌ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి. 
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చహల్, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ. 


Also Read: Anushka Sharma: అనుష్క శర్మ.. టూ హాట్! ఆసక్తికర కామెంట్ చేసిన విరాట్ కోహ్లీ!!


Also Read: Andre Russell: బంతి చాలా ఎత్తుకు ఎగరడం చూసి చాలా కాలమైంది.. రసెల్‌ ఆటకు షారుఖ్‌ ఖాన్‌ ఫిదా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.