MI vs PBKS: ఐపీఎల్ ట్రోఫీని అత్యధిక సార్లు గెల్చుకున్న ముంబై ఇండియన్స్ పూర్తిగా డీలా పడిపోయింది. వరుసగా మరో ఓటమిని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022 టోర్నమెంట్ మాజీ ఛాంపియన్లకు కలిసిరావడం లేదు. వరుస నాలుగు ఓటముల తరువాత చెన్నై సూపర్‌కింగ్స్ ఐదవ మ్యాచ్‌లో సత్తా చాటి గెలవగలిగింది. కానీ ఐదుసార్లు టైటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్ మాత్రం ఇంకా కోలుకోలేకపోతోంది. ఇంకా పరాజయ యాత్రను కొనసాగిస్తోంది. బుధవారం పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ సీజన్‌లో వరుసగా ఐదవ ఓటమి ఇది. 


ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు ఆరంభమే అదరగొట్టింది. ఓపెనర్లు మయాంక్, శిఖర్ ధావన్ లు ధాటిగా ఆడుతూ శుభారంభాన్నిచ్చారు. మయాంక్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేయగా..శిఖర్ ధావన్ 50 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ఆ తరువాత తిరిగి జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్‌లు రాణించడమే కాకుండా..చివరి ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టడంతో పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగులు చేయగలిగింది.


అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలో బాగానే ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా షాట్లు కొడుతున్నాడనగా..ఆ వికెట్ కోల్పోయింది. 28 పరుగులకే రోహిత్ వెనుతిరిగాడు. ఆ తరువాత మరో వికెట్ ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. అక్కడ్నించి కాస్త నిలదొక్కున్న ముంబై ఇండియన్స్ జట్టుకు బ్రేవిస్ సహకరించాడు. 25 బంతుల్లో 49 పరుగులు చేసి ఊపు మీదున్న బ్రేవిస్‌ను స్మిత్ అవుట్ చేశాడు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్‌పై జట్టు ఆశలు పెట్టుకుంది. ఓ దశలో భారీగా ఆడుతూ రిక్వైర్డ్ రన్‌రేట్ తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ దశలో భారీ షాట్‌కు ప్రయత్నించి 43 పరుగుల స్కోర్ వద్ద అవుటయ్యాడు. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుసగా ఐదవ ఓటమిని ఖాతాలో వేసుకుంది. 


Also read: Rohit Sharma: మరో 25 పరుగులే.. టీ20 చరిత్రలో అరుదైన రికార్డు అందుకోనున్న రోహిత్ శర్మ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook