IPL 2022 Play Off Chances: ఐపీఎల్ 2022 లో ఛాంపియన్లకు గడ్డుకాలంగా మారింది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే నిష్క్రమించగా..చెన్నై సూపర్ కింగ్స్ ఏటికి ఎదురీదుతోంది. ప్లే ఆఫ్ అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో గెలిచి తీరాల్సిన రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌లో సీఎస్కే ఓడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు ఐపీఎల్ 2022 టోర్నీలో ఏటికి ఎదురీదుతోంది. ఇప్పటివరకూ పది మ్యాచ్‌లు ఆడి..ఏడింట ఓడిపోయింది. మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి ఆరు పాయింట్లతో ఉంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయనేది అనుమానమే. అటు ముంబై ఇండియన్స్ ఒకే ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మరి చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏంటి..


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రస్తుతం 9 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే..మరో 8 పాయింట్లు కలుపుకుని 14 పాయింట్లు సాధిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం ప్లే ఆఫ్‌కు కటాఫ్ పాయింట్లు 16 కావచ్చని అంచనా. ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. అంటే మరో రెండు పాయింట్లు దూరంలో ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు చెరో 12 పాయింట్లతో 3, 4 స్థానాల్లో నిలిచాయి. 


14 పాయింట్లతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇప్పటికే రెండవ స్థానంలో ఉంది. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలిచి 10 పాయింట్లతో ఉంది. ఎస్ఆర్‌హెచ్ జట్టుకు ఇంకా ఐదు మ్యాచ్‌ల అవకాశముంది. ఈ నేపధ్యంలో అధికారికంగా ప్లే ఆఫ్ జాబితా ప్రకటించకపోయినా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అవకాశాలు దాదాపు లేనట్టే చెప్పాలి. ఆర్సీబీపై గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆ మ్యాచ్‌లో ఓటమిలో ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లేసినట్టైంది. 


Also read: Virat Kohli: విరాట్ కోహ్లీని లాగి కొట్టిన చెన్నై బౌలర్.. సీన్ కట్ చేస్తే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.