IPL 2022: ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్..సిక్సర్లతో హోరెత్తిన స్డేడియం
IPL 2022: ఐపీఎల్ 2022లో రెండవరోజు ప్రేక్షకులకు పండగగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్..హోరెక్కించింది.
IPL 2022: ఐపీఎల్ 2022లో రెండవరోజు ప్రేక్షకులకు పండగగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్..హోరెక్కించింది.
ఐపీఎల్ 2022 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండవరోజు అంటే నిన్న ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో స్టేడియం అంతటా పరుగులు వరదలై ప్రవహించాయి. ఫోర్లు, సిక్సర్లతో స్డేడియం హోరెక్కిపోయింది. క్రికెట్ ప్రేమికులకు మంచి కిక్కు ఇచ్చే మ్యాచ్‌గా మిగిలింది. పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యంగా సాగిన మ్యాచ్‌లో ఇరువైపుల్నించీ పరుగులే పరుగులు. జోరుగా సాగిన ఈ మ్యాచ్‌లో భారీ స్కోరును ఛేజ్ చేసి మరీ..పంజాబ్ కింగ్స్ లెవెన్ విజయంతో బోణీ కొట్టింది.
ఐపీఎల్ 2022లో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కేవలం 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కేవలం 57 బంతుల్లో 88 పరుగులు చేశాడు. ఇంందులో 7 సిక్సర్లు, 3 ఫోర్లున్నాయి. దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. ఆ తరువాత లక్ష్యసాధనకు బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ లెవెన్ 205 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే పూర్తి చేసింది. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేయగా..శిఖర్ ధావన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 43 పరుగులు చేాడు ఇక రాజపక్స 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు సాధించాడు. మరోవైపు షారుఖ్ ఖాన్ 20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మొత్తానికి బెంగళూరు ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు, పంజాబ్ ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లతో స్టేడియం హోరెక్కిపోయింది. రెండు జట్లలోనూ బ్యాటర్లదే పూర్తి ఆధిపత్యం కన్పించింది.
Also read: IPL 2022: ఆ రెండు కొత్త ఫ్రాంచైజీల తొలి మ్యాచ్ ఇవాళే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook