IPL 2022, Ravi Shastri feels Virat Kohli brain is fried and He needs to take a break: టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఇటీవల ఏదీ కలిసిరావడం లేదు. వరుసగా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అంతకుముందే బెంగళూరు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లీ.. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. కెప్టెన్సీ భారం లేదు కాబట్టి ఇక కోహ్లీ పరుగుల వరద పారిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. భారత జట్టులో అడపాదడపా మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. ఐపీఎల్ 2022లో మాత్రం విఫలమవుతున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లో 19.83 సగటుతో 119 పరుగులు మాత్రమే చేశాడు. మంగళవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడిన మ్యాచ్‌లో విరాట్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దుష్మంత చమీర వేసిన బంతికి  షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న దీపక్ హుడా చేతికి చిక్కాడు. దాంతో విరాట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. 


విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ నేపథ్యంలోనే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. కోహ్లీ బ్రెయిన్ ఫ్రై అయిపొయిందని, అతడికి విశ్రాంతి అవసరం అని అన్నాడు. రవిశాస్త్రి  స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... 'ఆటగాళ్లు విఫలమైనప్పుడు అనవసర ఒత్తిడి తెస్తే ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి. కోహ్లీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. భారత జట్టులో ఎవరికైనా విశ్రాంతిని ఇవ్వాలంటే అది కోహ్లీకి మాత్రమే. కోహ్లీ బ్రెయిన్ ఫ్రై అయిపొయింది. రీఫ్రెష్‌తో రీఎంట్రీ ఇవ్వాలంటే విశ్రాంతి చాలా అవసరం. అది రెండు నెలలలైనా, నెలన్నర రోజులైనా ఫర్వాలేదు' అని పేర్కొన్నాడు. 


'ఇంగ్లండ్ పర్యటనకు ముందు లేదా తర్వాత విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలి. కోహ్లీలో ఇంకా 6-7 ఏళ్ల క్రికెట్‌ ఆడే సత్తా ఉంది. తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల్లో ఆడించి ఆటకు దూరం చేయొద్దు. నేను కోచ్‌గా ఉన్నప్పుడు మొదటి చెప్పింది ఇదే. అలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఒక్కడే కాదు.. ప్రపంచ క్రికెట్‌లో ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. వారికీ విశ్రాంతి అవసరం. ఆటగాళ్లకు ఉన్న అసలు సమస్య ఏంటో గుర్తించాలి' అని రవిశాస్త్రి  చెప్పాడు. శాస్త్రి మాటలతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ ఏకీభవించాడు. నిజమే కోహ్లీకి విరామం అవసరమన్నాడు. 


Also Read: KL Rahul: ఐపీఎల్‌ రూల్స్ ఉల్లంఘన.. కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా! స్టొయినిస్‌కు వార్నింగ్


Also Read: Viral Video: రైలు కింద పడినా ప్రాణాలతో బయటపడిన మహిళ.. వైరల్ వీడియో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook