Viral Video: రైలు కింద పడినా ప్రాణాలతో బయటపడిన మహిళ.. వైరల్ వీడియో

Viral Video: ట్రైన్​ కింద ప్రమాదవశత్తు పడితే ప్రాణాల మాట అటుంచితే.. అసలు గుర్తు పట్టలేనంతగా నుజ్జు నుజ్జు అవ్వడం ఖాయం. అయితే ఓ మహిళ మాత్రం రైలు కింద పడినా.. ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించి వైరల్ వీడియో చూసేయండి ఇప్పుడే.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 01:08 PM IST
  • రైలు కింద పడినా బతికిన మహిళ
  • ఇంటర్నెట్​లో వైరల్ అవుతున్న వీడియో
  • అదృష్టమంటే ఆమెదేనంటున్న నెటిజన్లు
Viral Video: రైలు కింద పడినా ప్రాణాలతో బయటపడిన మహిళ.. వైరల్ వీడియో

Viral Video: కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలకే చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ కొన్ని సార్లు అత్యంత భారీ ప్రమాదం జరిగినా ఆశ్చర్యకరంగా ప్రాణాలతో ఉంటారు. అలాంటి ఘటనే ఇటీవల జరిగింది.

మూర్చపోవడంతో ప్రమాదవశత్తు రైలు కింద పడిన ఓ మహిళ.. ప్రాణాలతో బయటపడటం విశేషం. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎక్కడ జరిగిందంటే..

అర్జెంటినాలోని ఓ రైల్వే స్టేషన్​లో జరిగింది ఈ ఘటన. ఓ రైలు ప్లాట్​ఫమ్ మీదకు వస్తున్న సమయంలో ప్లాట్​ఫామ్​పై అంతా దూరంగా నిలుచున్నారు. ఆ జనాల మధ్యలో ఉన్న ఓ మహిళ మార్చపోయి.. ప్రమాదవశత్తు రైలు వైపు వెళ్లింది. అక్కడున్నవాళ్లు అమెకు ఏదో జరిగిందని గుర్తించేలోపే.. అమె ట్రైన్​కు, ప్లాట్​ఫామ్​కు మధ్యలో ఉన్న గ్యాప్​లో పడిపోయింది. అయితే ట్రైన్ ఆగిన తర్వాత.. అక్కడున్న వాళ్లంతా ఆమెను ట్రైన్​ ట్రాక్ నుంచి పైకి లాగారు. అదృష్టవశత్తు అమె ప్రాణాలతో ఉండటంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అమెకి చిన్న చిన్న గాయాలు కావడంతో హుటా హుటినా ఆస్పత్రికి తరలించారని న్యూయార్క్ పోస్ట్ రాసుకొచ్చింది.

ఈ దృష్యాలన్నీ ఆ రైల్వేస్టేషన్​లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్​ అయ్యాయి. అయితే ఈ ఘటన మార్చి 29న జరిగినట్లు తెలిసింది. కాగా ఇందుకు సంబందించిన సీసీటీవీ వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. ట్రైన్​ కింద పడినా ప్రాణాలతో బయటపడంతో.. చాలా మంది అదృష్టం అంటే ఇదే అంటూ అమె గురించి చర్చించుకుంటున్నారు. మరి ఆ వీడియోను మీరు చూసేయండి ఇప్పుడే.

Also read: Charging Tips: మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా..ఈ టిప్స్ పాటించండి

Also read: Python attacks Baby Cow: ఆవుదూడను ఆ కొండ చిలువ మింగేసిందా ? ఆ తరువాత ఏం జరిగింది ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News