RCB vs CSK: ఐపీఎల్ 2022లో ఇవాళ మరో కీలకమైన మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మధ్య జరగనుంది. ధోని మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడంపై అతనికొచ్చిన అభ్యంతరమేంటి, ఎందుకు ఆశ్చర్యానికి లోనయ్యాడు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో కీలక పరిణామం జరిగింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండి, ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఓ స్థానం ఎగువన నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో జరిగిన మార్పు అది. వరుస ఓటములతో తట్టుకోలేక ఆ జట్టు సారధి రవీంద్ర జడేజా నాయకత్వ బాధ్యతల్ని స్వయంగా వదిలేశాడు. మహేంద్రసింగ్ ధోనికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ సారధ్యాన్ని తిరిగి స్వీకరించిన తరువాత తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుత విజయం సాధించాడు. ఇవాళ అంటే బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనున్నాడు.


ధోని బాథ్యతలు స్వీకరించడంపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్పందించాడు. సీజన్ మధ్యలో కెప్టెన్సీలో మార్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అదే సమయంలో కెప్టెన్సీ మార్పు జరిగిన తీరు అతడిని మరింత ఆశ్చర్యానికి గురి చేసిందట. ఇలా రెండుసార్లు ఆశ్చర్యపోవల్సిన అవసరమొచ్చిందంటున్నాడు. అదే సమయంలో సీఎస్కే విజయం వెనుక ధోని ఉన్నాడనేది అందరికీ తెలిసిన రహస్యమేనని..తోటి ఆటగాళ్ల నుంచి బెస్ట్ రిజల్ట్ రాబట్టుకోవడమెలా అనేది ధోనికు బాగా తెలుసని ప్రశంసించాడు. 


ధోని సారధ్యంలో ఆర్సీబీపై విజయం కోసం సీఎస్కే సిద్ధమౌతోంది. ఇది ఆ జట్టుకు అవసరం కూడా. ఇక నుంచి సీఎస్కే ఆడే ప్రతి మ్యాచ్ గెలవక తప్పని పరిస్థితి. అదే సమయంలో ఆర్సీబీకు కూడా ఈ విజయం అనివార్యం. ఆర్సీబీ వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. గత రెండు మ్యాచ్‌లలో జట్టుకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని..తిరిగి ఫామ్‌‌లో వస్తామని డుప్లెసిస్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.


Also read: IPL 2022 Play off Race: ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్ రేసులో ఏ జట్లు, హైదరాబాద్, ఆర్ఆర్,ఆర్సీబీ, పంజాబ్‌లో ఎవరికి అవకాశాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook