Riyan Parag vs Harshal Patel: ఐపీఎల్ 2022..ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్. ఫలితం సంగతెలా ఉన్నా ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. మాటల యుద్ధం..ఇరువురి మధ్య వైరానికి తెరతీసింది. ఎంతలా అంటే..కనీసం షేక్ హ్యాండ్ నిరాకరించేంతగా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు విజయం సాధించింది. పూర్తిగా బౌలర్లదే ఆధిపత్యంగా సాగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ పైచేయి సాధించింది. విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్ కొనసాగించలేని పరిస్థితి. అయితే మ్యాచ్ ఫలితం చర్చనీయాంశం కాలేదు కానీ..ఇదే మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఘర్షణ మాత్రం వైరల్ అవుతోంది. హుందా గేమ్‌గా పిల్చుకునే క్రికెట్‌లో స్పోర్టివ్ స్పిరిట్ కొరవడుతోందని మరోసారి నిరూపించింది ఈ ఘటన. 


రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో రియాన్ పరాగ్ ఒక్కసారిగా చెలరేగి ఆడి 18 పరుగులు సాధించాడు. ఫలితంగా ఆర్ఆర్ జట్టు 144 పరుగులైనా చేయగలిగింది. 20వ ఓవర్ ముగిశాక..పెవిలియన్ వైపుకు వెళ్తున్న రియాన్ పరాగ్ ఒక్కసారిగా వెనుదిరిగాడు. హర్షల్ పటేల్ వైపుకు వస్తూ..ఏవేవో పరుషంగా మట్టాడాడు. ఫలితంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం రేగింది. ఏం జరిగింది, ఎందుకిద్దరూ మాటలు విసురుకున్నారు, ఎందుకు ఒకరిపై మరొకరు దూసుకెళ్లారనేది తెలియదు కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. ఆ తరువాత మ్యాచ్ ముగిసిన తరువాత కూడా ఈ ప్రభావం స్పష్టంగా కన్పించింది. ప్రతి మ్యాచ్ ముగిశాక..ఇరు జట్లు వరుసగా నిలుచుని ఒకరి కొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని..పలకరించుకుంటూ వెళ్లడం ఓ సాంప్రదాయం. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ముగిశాక..వరుసగా ఇరుజట్లు ఆటగాళ్లు ఒకరికొకరు కలుసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు.



రియాన్ పరాగ్..హర్షల్ పటేల్ ఎదురెదురయ్యారు. రియాన్ పరాగ్‌తో చేతులు కలపకుండా అంటే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పటేల్ ముందుకెళ్లిపోతుంటే..పరాగ్ కాస్సేపు అలా చూస్తుండిపోయాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఒకరిపై మరొకరు పాత విషయాల్ని మనసులో పెట్టుకుంటున్నారు. క్రికెట్‌లో ఏది ఉండకూడదో అదే ప్రతిబింబిస్తోంది. 


Also read: Patel vs Parag: పటేల్, పరాగ్‌ల మాటల యుద్ధం, ఒకరిపై మరొకరు దూసుకుపోయి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.