IPL 2022, Virat Kohli dought for Rajasthan Royals match: ఐపీఎల్ 2022లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమవుతోంది. మంగళవారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30కు ప్రారంభం కానుంది. గత మ్యాచులో  హైదరాబాద్ జట్టుపై ఘోర పరాభవం ఎదుర్కొన్న బెంగళూరు.. భీకరమైన ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ను ఎదుర్కోనుంది. ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచులో 68 పరుగులకే ఆలౌట్ బెంగళూరు మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఇందుకోసం బ్యాటింగ్ తప్పిదాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఆర్‌తో మ్యాచ్ కోసం బెంగుళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తుది జట్టులో 1-2 మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్ అనుజ్ రావత్ నిలకడ లేమితో సతమతమవుతున్నాడు. రావత్ ఆడిన 8 మ్యాచ్‌లలో 129 పరుగులు మాత్రమే చేశాడు. ఎస్ఆర్‌హెచ్‌పై డకౌట్ అయ్యాడు. దాంతో అతడి స్థానంలో మహిపాల్ లోమ్రోర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫాఫ్ డుప్లెసిస్ పరుగులు చేస్తుండడం కలిసొచ్చే అంశం. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ బెంగళూరుకి అతిపెద్ద ప్రతికూలాంశం. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 17 సగటుతో 119 పరుగులు మాత్రమే చేశాడు. వేరే ఆటగాడు అయితే ఇప్పటికే తుది జట్టునుంచి పోయేవాడు. కానీ కోహ్లీ కాబట్టి ఫాఫ్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. 


గ్లెన్ మాక్స్‌వెల్ మెరుపులు ఒకటిరెండు మ్యాచులకే పరిమితం అయ్యాయి. ఇప్పటికైనా మాక్స్‌వెల్ తన పవర్ చూపించాల్సి ఉంది. సుయాష్ ప్రభుదేసాయి, షాబాజ్ అహ్మద్ కూడా గాడిలో పడితే బెంగుళూరు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. దినేష్ కార్తీక్ ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఫినిషర్ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నాడు. డీకే నుంచి మరిన్ని మెరుపు ఇన్నింగ్స్ బెంగళూరు ఆశిస్తోంది. వనిందు హసరంగా చెలరేగితే తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. 


మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మంచి ఊపుమీదుంది. ప్లేయర్స్ అందరూ సమిష్టిగా రాణిస్తున్నారు. అయితే తుది జట్టు నుంచి రియాన్ పరాగ్‌ను తీసేసే అవకాశం ఉంది. వరుసగా విఫలమవుతున్న అతడి స్థానంలో శుభమ్ గార్వాల్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఒబెడ్ మెక్‌కాయ్‌ స్థానంలో జేమ్స్ నీషమ్‌ రానున్నాడు. జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్ సత్తాచాటున్న విషయం తెలిసిందే. 


బెంగళూరు తుది జట్టు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, జోష్ హజిల్‌వుడ్, మొహ్మద్ సిరాజ్. 


Also Read: Andre Russell Six: ఆండ్రీ రస్సెల్ సిక్స్ కొడితే మాములుగా ఉండదు.. ప్లాస్టిక్ చైర్ కూడా బొక్కపడాల్సిందే (వీడియో)


Also Read: Ranasthali First Look Poster: క్రిష్ చేతులమీదుగా 'రణస్థలి' ఫస్ట్ లుక్ పోస్టర్.. అచ్చు కేజీఎఫ్ మాదిరే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.