Andre Russell Six: ఆండ్రీ రస్సెల్ సిక్స్ కొడితే మాములుగా ఉండదు.. ప్లాస్టిక్ చైర్ కూడా బొక్కపడాల్సిందే (వీడియో)

IPL 2022 Sixes, KKR Player Andre Russell six breaks plastic chair. ఐపీఎల్ 2022 ప్రాక్టీస్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ భారీ సిక్సులు బాదాడు. అందులో ఒకటి ఏకంగా మైదానం బయట పడింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 26, 2022, 04:21 PM IST
  • ఆండ్రీ రస్సెల్ సిక్స్ కొడితే మాములుగా ఉండదు
  • ప్లాస్టిక్ చైర్ కూడా బొక్కపడాల్సిందే
  • చెమటోడ్చుతున్న కేకేఆర్ ఆటగాళ్లు
 Andre Russell Six: ఆండ్రీ రస్సెల్ సిక్స్ కొడితే మాములుగా ఉండదు.. ప్లాస్టిక్ చైర్ కూడా బొక్కపడాల్సిందే (వీడియో)

Andre Russell hug six breaks plastic chair: వెస్టిండీస్‌ ఆటగాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో భారీ సిక్సులు బాదడంతో వాళ్లది ప్రత్యేక శైలి. కీరన్ పోలార్డ్, ఆండ్రీ రస్సెల్, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్‌వైట్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మేయర్ లాంటి ప్లేయర్స్ భారీ సిక్సులు బాదగలరు. అయితే వీరందరిలో ఆండ్రీ రస్సెల్‌ది ప్రత్యేక శైలి. రస్సెల్‌ భారీ భారీ సిక్సులు బాదగలడు. ఒకోసారి బంతులు స్టేడియం బయట కూడా పడుతుంటాయి. అయితే ఆ సిక్సుల కారణంగా ఒక్కోసారి చైర్, గ్లాసులు పగులుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. 

ప్రస్తుతం ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. 15వ సీజన్లో కోల్‌కతా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో మూడు విజయాలు మాత్రమే అందుకుని పట్టికలో 8వ స్థానంలో ఉంది. శనివారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచులో కోల్‌కతా 8 పరుగుల తేడాతో ఓడింది. ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే.. కోల్‌కతా ఇకపై ఆడే మ్యాచుల్లో సత్తాచాటాల్సి ఉంది. అందుకోసం ప్లేయర్స్ అందరూ కష్టపడుతున్నారు. 

కోల్‌కతా నైట్ రైడర్స్ గురువారం తన తదుపరి మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కేకేఆర్ ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. ముఖ్యంగా ఆండ్రీ రస్సెల్ నెట్ ప్రాక్టీస్‌లో కష్టపడుతున్నాడు. ప్రాక్టీస్‌లో భాగంగా రస్సెల్ భారీ సిక్సులు బాదాడు. అందులో ఒకటి ఏకంగా మైదానం బయట పడింది. రస్సెల్ కొట్టిన బంతి బయట ఉన్న ప్లాస్టిక్ చైర్‌పై పడడంతో దానికి పెద్ద బొక్క పడింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'రస్సెల్ ప్రభావం కోసం చివరి వరకు వేచి ఉండండి' అని కోల్‌కతా క్యాప్షన్ ఇచ్చింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kolkata Knight Riders (@kkriders)

ఐపీఎల్ 2022లో ఆండ్రీ రస్సెల్ ఇప్పటివరకు 7 ఇన్నింగ్స్‌ల్లో 227 పరుగులు చేశాడు. 180.15 స్ట్రైక్ రేట్ మరియు 45.40 సగటుతో పరుగులు చేశాడు. భారీ ఇన్నింగ్స్ అడగల రస్సెల్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ చాలా నమ్మకం పెట్టుకుంది. ఇక రస్సెల్ ఐపీఎల్ టోర్నీలో మొత్తం 92 మ్యాచ్‌లు ఆడాడు.178.76 స్ట్రైక్ రేట్‌తో 1927 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రస్సెల్ 10 హాఫ్ సెంచరీలు కూడా బాదాడు. సుదీర్ఘ కాలంగా కోల్‌కతా తరఫున ఆడుతున్నాడు. 

Also Read: Harbhajan Singh: ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టును ప్రకటించిన భజ్జీ.. ఎవరెవరికి చోటు దక్కిందంటే..?

Also Read: Rishi Dhawan Face Mask: ఎంఎస్ ధోనీకి బయపడే.. రిషి ధావన్‌ ఫేస్‌గార్డ్‌ పెట్టుకున్నాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News