RCB vs CSK: చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 పరుగుల తేడాతో విజయం
RCB vs CSK: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్‌కు చేరాలనే చెన్నై ఆశలు మరింత సన్నగిల్లాయి.
RCB vs CSK: ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో ఆర్సీబీ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్‌కు చేరాలనే చెన్నై ఆశలు మరింత సన్నగిల్లాయి.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్ల్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టు ప్రారంభంలో ధాటిగా ఆడింది. తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 51 పరుగులు చేసింది. ఆ తరువాత 8వ ఓవర్ ముగిసేసరికి కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్..మొయిన్ అలీ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. డుప్లెసిస్ 14 బంతుల్లో 38 పరుగులతో విజృంభించి ఆడాడు. ఆ తరువాత ఓవర్ ముగిసేసరికి మ్యాక్స్‌వెల్ రూపంలో మరో వికెట్ కోల్పోయింది. పది ఓవర్ల ముగిసేసరికి విరాట్ కోహ్లీ కూడా అవుటయ్యాడు. కోహ్లీ ఈసారి 33 బంతుల్లో 30 పరుగులు చేశాడు. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో మరోసారి ధాటిగా ఆడటంతో 176 పరుగులు చేయగలిగింది.
ఇక 174 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 3 ఓవర్ల వరకూ నిలకడగానే ఉంది. వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. 7వ ఓవర్‌లో తొలి వికెట్ రుతురాజ్ గైక్వాడ్ రూపంలో 54 పరుగుల వద్ద కోల్పోయింది. ఆ తరువాత రెండవ వికెట్ 59 పరుగుల వద్ద రాబిన్ ఊతప్ప అవుటయ్యాడు. తరువాత మూడవ వికెట్ అంబటి రాయుడు అవుటయ్యాడు. ఆ తరవాత ఇక ఆ తరువాత సీఎస్కే బ్యాటర్లు ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. తరువాత కాన్వే, జడేజాలు అవుటయ్యారు. ఇక 133 పరుగుల వద్ద మొయిన్ అలీ అవుట్ కావడంతో ఇక సీఎస్కే ఆశలు సన్నగిల్లాయి. తరువాత బరిలో దిగిన సీఎస్కే కెప్టెన్ ధోని కూడా నిరాశ పర్చాడు. 19.2 ఓవర్లలో 149 పరుగుల వద్ద 8 వ వికెట్ కోల్పోయింది.
మరో రెండు వికెట్లు ఉన్నాయనగా..తీక్షణ సిక్సర్, బౌండరీ సాధించడంతో..1 బంతిలో 15 పరుగులు చేయాల్సి వచ్చింది. చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పరాజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా సన్నగిల్లాయి. సీఎస్కే నుంచి కాన్వే 56 పరుగులు, మొయిన్ అలీ 42 పరుగులు చేశారు.
Also read: ICC Rankings: ఐసీసీ టీ20ల్లో అగ్రస్థానంలో టీమిండియా.. టెస్టులు, వన్డేల్లో ఇలా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook