ICC Rankings: ప్రపంచ నంబర్ వన్ టీ20 టీమ్‌గా భారత్ (India) 2021-22 సీజన్‌ను ముగించింది. స్వదేశంలో నిలకడైన ఆటతీరును ప్రదర్శించిన టీమిండియాకు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ (ICC T20 Rankings)లో అగ్రస్థానం దక్కింది. నూతన సారథి రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక సిరీస్ లను వైట్‌వాష్ చేసింది. ఈ క్రమంలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్‌ను టీమిండియా వెనక్కి నెట్టింది. 270 పాయింట్లతో భారత్, 265 పాయింట్లతో ఇంగ్లాండ్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నట్లు ఐసీసీ ప్రకటించింది. తర్వాత స్థానాల్లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ఉన్నాయి.
కానీ టెస్టుల్లో టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా (Australia) ఉంది. భారత్ కు, ఆసీస్ కు తొమ్మిది పాయింట్ల తేడా ఉంది. మెుదట్లో ఆసీస్ కు, ఇండియాకు మధ్య తేడా రెండు పాయింట్లే ఉండేది. అయితే జనవరిలో జరిగిన యాషెస్ సిరీస్ ను 4-0 తేడాతో గెలవటంతో కంగూరు జట్టు అగ్రస్థానానికి దూసుకెళ్లింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. వన్డే ర్యాంకింగ్స్ లో కివీస్ తొలి స్థానం దక్కించుకోగా... భారత్ (Teamindia) నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రెండు, మూడు స్థానాల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook