RCB vs RR: ఐపీఎల్ 2022లో ఇక ఫైనల్ పోరు ఒక్కటే మిగిలింది. క్వాలిఫయర్ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 7 వికెట్లు తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో ఆసక్తిగా మారిన క్వాలిఫయర్ 2 ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. ఆర్సీబీ ఇంటికి చేరగా..ఆర్ఆర్ జట్టు ఫైనల్‌కు చేరింది. మే 29న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత  20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 157 పరుగులే చేయగలిగింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. రజత్ పటిదార్ మరోసారి సత్తా చాటాడు. 42 బంతులక్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడుతూనే 13 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ 27 బంతుల్లో 25 పరుగులు చేసి వెనుదిరిగాడు. మొత్తానికి 157 పరుగులకు ఇన్నింగ్స్ ముగించేసింది.


ఆ తరువాత 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ధాటిగా ఆడారు. జైశ్వాల్ 13 బంతుల్లో 21 పరుగులు చేసి అవుటైన..బట్లర్ ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ కొనసాగించాడు. బట్లర్ మరోసారి అద్భుత ప్రదర్శన చూపించాడు. కేవలం 60 బంతుల్లో 106 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు.రాజస్థాన్ రాయల్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో 11 బంతులు మిగిలుండగానే..3 వికెట్లు కోల్పోయి..161 పరుగులు చేసింది. జోస్ బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మే 29వ తేదీన ఐపీఎల్ 2022 ఫైనల్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. 


Also read: RR vs RCB: ఆర్ఆర్ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ ఓ సమస్యగా మారవచ్చంటున్న సంజయ్ మంజ్రేకర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook