IPL 2022 Captains: ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్‌లు ఆరుగురు.. ప్రస్తుతం ఉన్నది మాత్రం `ఒకే ఒక్కడు`!
IPL 2022: Rohit Sharma remains the only active IPL winning captain. ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్‌ల ఆరుగురిలో ప్రస్తుతం కెప్టెన్సీ పదవిలో ఉన్నది మాత్రం `ఒకే ఒక్కడు`. ఆ ఒక్కడు ఎవరో ఇప్పటికే అర్ధమయిపోయుంటుంది.. అతడే రోహిత్ శర్మ.
Rohit Sharma remains the only active IPL winning captain in the league: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియరల్ లీగ్ (ఐపీఎల్) 2022కు సమయం ఆసన్నమైంది. మరికాసేపట్లో మెగా లీగ్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబైలోని వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. ఇక ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జరిగినా.. ఎప్పటిలానే చెన్నై, ముంబై జట్లు టైటిల్ ఫెవరెట్‌గా కనిపిస్తున్నాయి.
మెగా లీగ్‌లో ఇప్పటివరకు 14 సీజన్లు విజయవంతంగా ముగిసాయి. ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్‌లు ఆరుగురు ఉన్నారు. అత్యధికంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐదుసార్లు టైటిల్ అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఎంఎస్ ధోనీ నాలుగు కప్పులు సాధించి పెట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీంకు గౌతమ్ గంభీర్ రెండు కప్పులు అందించాడు. ఇక షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్), ఆడమ్ గిల్ క్రిస్ట్ (డెక్కన్ చార్జెస్), డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) తమ జట్లకు ఒక్కోసారి ఐపీఎల్ టైటిల్ సాధించి పెట్టారు.
అయితే ఐపీఎల్ టైటిల్ గెలిచిన కెప్టెన్‌ల ఆరుగురిలో ప్రస్తుతం కెప్టెన్సీ పదవిలో ఉన్నది మాత్రం 'ఒకే ఒక్కడు'. ఆ ఒక్కడు ఎవరో ఇప్పటికే అర్ధమయిపోయుంటుంది.. అతడే రోహిత్ శర్మ. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2021 వరకు ఎంఎస్ ధోనీ సారథిగా ఉన్నా.. రెండు రోజుల క్రితమే ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. ఇక ఐపీఎల్ 2021 సమయంలో డేవిడ్ వార్నర్‌ను హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. షేన్ వార్న్, గౌతమ్ గంభీర్, ఆడమ్ గిల్ క్రిస్ట్ ఎప్పుడో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఈ విషయాన్ని రోహిత్ టీవీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ రోజు ఐపీఎల్ 2022 ఆరంభం కానున్న నేపథ్యంలో సరదాగా ట్వీట్ చేశారు. 'ఐపీఎల్ లీగ్‌లో టైటిల్ గెలిచిన కెప్టెన్‌లలో రోహిత్ శర్మ మాత్రమే కెప్టెన్సీ పదవిలో ఉన్నాడు' అని కాప్షన్ ఇచ్చింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్ప్పుకోవడంతో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో ఎవరి వల్ల కాదు.
Also Read: CSK vs KKR: ఐపీఎల్ 2022 ఆరంభ మ్యాచ్.. ముగ్గురు ఆటగాళ్లను ఊరిస్తున్న టాప్ రికార్డులు ఇవే!!
Also Read: TS Traffic Challans: పొడిగింపు లేదు.. ట్రాఫిక్ చలాన్ రాయితీ ఈ నెలాఖరు వరకే! వెంటనే త్వరపడండి!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook