TS Traffic challan discount offer end on March 31: వాహనదారులు.. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికీ కూడా మీ వాహనాల చలాన్లను క్లియర్ చేసుకోకుంటే.. వెంటనే ఆన్లైన్లో చెల్లించండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఇచ్చిన భారీ డిస్కౌంట్ల ఆఫర్ మరో ఐదు రోజుల్లో ముగిసిపోనుంది. తెలంగాణ ప్రజలపై పెండింగ్ చలాన వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించడానికి ట్రాఫిక్ పోలీస్ శాఖ భారీ డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
మార్చి 31 వరకే చలాన్లపై రాయితీ సదుపాయం ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ రాయితీ గడువును పొడిగించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ మాసం నుంచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఎవరైనా సరే ఛార్జిషీట్లు వేస్తామని హెచ్చరించారు. టార్గెట్ పెట్టుకుని చలాన్లు వసూలు చేయాలనే ఆలోచన తమకు లేదని, మొత్తంగా 60 నుంచి 70 శాతం చలాన్లు క్లియర్ అవుతాయని తాము అంచనా వేస్తున్నామని రంగనాథ్ చెప్పారు.
పెండింగ్ చలాన్ రాయితీ అమలులోకి రాగానే.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వాహనదారులు అప్రమత్తం అయ్యారు. ఆన్లైన్లో తమ చలాన్లను చెల్లించారు. దాదాపు 650 కోట్లకు పైగా విలువైన చలాన్స్ క్లియర్ అయ్యాయి. ఇందులో రాయితీ పోను దాదాపుగా 190 కోట్లు ప్రభుత్వ ఖజానా లో చేరాయట. ఇప్పటి వరకు కోటి 85 లక్షల ఛలన్లు క్లియర్ అయ్యాయని ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ చెప్పారు. రోజుకు 7 నుంచి 10 లక్షల వరకు చలాన్లు క్లియర్ అవుతున్నాయన్నారు. ఇంకా ఐదు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో మరింత ఖజానా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్‌లో ఉన్నాయని ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. ఒక స్కూటర్ యజమానికి అత్యధికంగా 178 చలాన్లు ఇంకా ఉన్నాయట. ప్రధానంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు ఈ చలాన్లు పడ్డాయట. ఆగస్టు 2019 నుండి ఇప్పటివరకు 178 చలాన్ల మొత్తం 48,595గా ఉందట. రాయితీ పోను అతను చెల్లించేది 12,490 మాత్రమే. మరో బైకర్‌కు రూ.73,690 చలాన్లు ఉన్నాయట. రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ మరియు హెల్మెట్ లేకుండా రైడింగ్ చేసినందుకు ఇవి పడ్డాయి. అతను ప్రత్యేక రాయితీని ఉపయోగించుకుని 19,515 చెల్లిస్తే సరిపోతుంది.
Also Read: Samantha: పుకార్లు, విమర్శలు వచ్చినా.. సమంత ఇంకా అతనితోనే ఉంది!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook