SRH vs PBKS: ఐపీఎల్ 2022 చివరి మ్యాచులో హైదరాబాద్, పంజాబ్ ఢీ.. సన్‌రైజర్స్ కెప్టెన్, తుది జట్ల వివరాలు ఇవే!
IPL 2022 SRH vs PBKS Playing 11. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. లీగ్ దశకు నేటితో శుభం కార్డు పడనుంది.
SRH vs PBKS preview and prediction, Bhuvneshwar Kumar to lead Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 లీగ్ దశకు నేటితో శుభం కార్డు పడనుంది. చివరి లీగ్ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో ఆదివారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. హైదరాబాద్, పంజాబ్ జట్లు ఇప్పటికే ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో.. ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగనుంది. అయితే గెలుపుతో ఈ సీజన్‌ను ముగించాలని రెండు టీమ్స్ చూస్తున్న నేపథ్యంలో మ్యాచ్ రసత్తరంగా సాగే అవకాశం ఉంది.
మొదటి సగంలో 7 మ్యాచ్‌లల్లో ఏకంగా ఐదు విజయాలను అందుకున్న తరువాత ఒక్కసారిగా కుప్పకూలింది సన్‌రైజర్స్ హైదరాబాద్. రెండో సగంలో ఆడిన ఏడు మ్యాచులో కేవలం రెండు విజయాలు మాత్రమే అందుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నప్పటి దూకుడు కొనసాగించలేకపోవడమే ఈ ఓటములకు కారణం. ఫస్ట్ హాఫ్‌లో రెండో స్థానం వరకు ఎగబాకిన హైదరాబాద్.. సెకండ్ హాఫ్‌లో పేలవ ప్రదర్శనతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. మొత్తంగా 13 మ్యాచ్‌లల్లో ఆరు గెలిచి పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ గెలిస్తే పైకి దూసుకెళ్లే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ కేన్ విలియమ్సన్.. వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. దాంతో నేటి మ్యాచ్‌కు కేప్టెన్‌గా ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్. అందులో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఒకరు కాగా వికెట్ కీపర్ నికొలస్ పూరన్ మరొకడు. ఈ ఇద్దరిలో ఒకరు తాత్కాలికంగా జట్టు కేప్టెన్సీ పగ్గాలను అందించే అవకాశం ఉంది. భువనేశ్వర్ కుమార్ వైపే సన్‌రైజర్స్ యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో భారీ ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. టీ నటరాజన్, ఐడెన్ మార్క్రమ్, వాషింగ్టన్ సుందర్‌లకు విశ్రాంతినిచ్చి.. అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, గ్లెన్ ఫిలిప్స్, కార్తీక్ త్యాగిలకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది.
మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ కూడా ఐపీఎల్ 2022 నుంచి ఔట్ అయింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఆరింట్లో నెగ్గి 12 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. దాంతో ఈ రోజు తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. జట్టు నుంచి హర్ప్రీత్ బ్రార్, రిషి ధవన్, భానుక రాజపక్సలను తప్పించి బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, వైభవ్ అరోరా తుది జట్టులో ఆడించే ఛాన్స్ ఉంది.
తుది జట్లు (అంచనా):
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ప్రియం గార్గ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), ఫజల్ హక్ ఫారూఖి, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి.
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టొన్, బెన్నీ హోవెల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), ఇషాన్ పోరెల్, వైభవ్ అరోరా, కగిసొ రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
Also Read: IPL 2022 Playoffs: క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లలో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇదే!
Also Read: Virat Kohli Tweet: ఢిల్లీపై ముంబై విజయం.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ ట్వీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook