IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్​) 2022 సీజన్​ పూర్తిగా దేశీయంగానే జరగనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు (BCCI on IPL 2022) తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశీయంగా జరగటం మాత్రమే కాకుండా.. మ్యాచ్​లు అన్ని కూడా ఒకే నగరంలో జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


సీజన్ మొత్తం ముంబయిలోనే నిర్వహించాలని బీసీసీఐ (IPL 2022 entirely conduct in Mumbai) భావిస్తోందట. వాంఖడే స్టేడియం, క్రికెట్ క్లబ్​ ఆఫ్ ఇండియా (సీసీఐ), డీవై పాటిల్ స్టేడియంలలో మ్యాచ్​లు నిర్వహించాలని ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నట్లు తెలిసింది. మరీ అవరమైతే మహారాష్ట్ర దాటుకుండా.. పుణెలోని స్టేడియంలో కూడా మ్యాచ్​లు నిర్వహించే వీలుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.


ఇక కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని మళ్లీ ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్​లు నిర్వహించాలని బీసీసీఐ (IPL 2022 held without audience) భావిస్తోందని సమాచారం. ఈ విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.


మెగా వేలానికి సర్వం సిద్ధం..


ఐపీఎల్ 2022 సీజన్​కు ముందు మెగా వేలం ప్రక్రియ (IPL mega auction 2022) జరగనుంది. వేలలో పాల్గొనే ప్లేయర్స్​ రిజిస్ట్రేషన్​కు ఈ నెల 20తో గడువు ముగిసింది. మొత్తం 1,214 మంది ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 896 మంది ఇండియన్ ప్లేయర్స్​ కాగా.. 318 మంది ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు.


వీరిలో 270 మంది క్యాప్‌డ్‌, 903 మంది అన్‌క్యాప్‌డ్, 41 మంది అసోసియేట్‌ ప్లేయర్లు ఉండటం గమనార్హం.


మొత్తం 10 టీమ్​లు ఈ మెగా వేలంలోనే ప్లేయర్స్​ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనితో ఈ ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఈ వేలం ప్రక్రియ (IPL mega auction 2022 Dates) జరగనుంది.


Also read: Pakistan Tour: లాహోర్ పేలుళ్లతో ఆసీస్ జట్టు పాక్ పర్యటనపై నీలినీడలు


Also read: Sanjay Manjrekar: టీమ్ ఇండియా సెలెక్షన్‌పై మండిపడ్డ సంజయ్ మంజ్రేకర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook