Pakistan Tour: ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ పర్యటన మరోసారి సందిగ్దంలో పడింది. పాకిస్తాన్ లాహోర్ నగరంలో జరిగిన భారీ పేలుడుతో ఆసిస్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2022 జనవరి 27న ప్రారంభం కానుంది. మరోవైపు మార్చ్ నెలలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటించనుంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్‌లోని లాహోర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో 30 మంది మరణించారు. ఈ ఘటనపై మాట్లాడిన పాకిస్తాన్ కేంద్ర మంత్రి షేర్ రషీద్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు ఆస్ట్రేలియా పర్యటనను అడ్డుకోవడమే బాంబు పేలుళ్ల (Lahore Bomb Blast)ప్రధాన ఉద్దేశ్యమని చెప్పడంతో పర్యటనపై నీలినీడలు అలముకున్నాయి.
దేశంలో శాంతి నెలకొందని..అందుకే పాకిస్తాన్‌ను అస్థిరపర్చేందుకు ముష్కరులు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి రషీద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్, చారిత్రాత్మక ఆస్ట్రేలియా పర్యటనను (Australia Tour)అడ్డుకోవడమే పేలుడు ఉద్దేశ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా జట్టు 24 ఏళ్ల తరువాత తొలిసారిగా పాకిస్తాన్‌లో మార్చ్‌లో అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇప్పుడీ పర్యటన అనుమానాస్పదంగా మారింది.
Also read: Sanjay Manjrekar: టీమ్ ఇండియా సెలెక్షన్‌పై మండిపడ్డ సంజయ్ మంజ్రేకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook