Full List Of Retained And Released Players by Mumbai Indians for IPL 2023: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకి ఐపీఎల్ 2022 సీజన్‌ ఓ పీడకల. చెత్త ఆటతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అంతకుముందు సీజన్‌లో కూడా దారుణంగా విఫలమైంది. 15 ఏళ్ల టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఆడిన ముంబై.. ఐపీఎల్ 2023లో బలంగా తిరిగిరావాలనుకుంటోంది. ఈ క్రమంలోనే రిటెన్షన్ ప్రక్రియలో ఏకంగా 13 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. సీనియర్‌ బ్యాటర్ కీరన్‌ పొలార్డ్‌ను ముంబై వదిలేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కీరన్ పోలార్డ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకున్న ముంబై ఇండియన్స్.. అంతర్జాతీయ ప్లేయర్స్ డానియల్ సామ్స్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్‌లను వదిలేసింది. దేశవాళీ ఆటగాళ్లు అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, జయదేవ్ ఉనాద్కత్, బసిల్ థంపి, మయాంక్ మార్కండే, రాహుల్ బుద్ది, మురుగన్ అశ్విన్, సంజయ్ యాదవ్‌లను వదులుకుంది. రోహిత్ శర్మ, టీమ్ డేవిడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టాన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రేవిస్, జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 


 గతేడాది ఆర్‌సీబీకి ఇచ్చిన జాసన్ బెహ్రెండార్ఫ్‌ను ముంబై ఇండియన్స్ మళ్లీ ట్రేడ్ చేసుకుంది. ఇక రిటెన్షన్ ప్రక్రియలో ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదిలేయడంతో ముంబై పర్స్‌లో రూ. 20.5 కోట్లు మిగిలాయి. ఈ డబ్బుతో డిసెంబర్ 23న జరిగే ఐపీఎల్ 2023 వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయాలని చూస్తోంది. ముంబై జట్టులో మూడు ఓవర్‌సీస్ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. దాంతో ఇద్దరు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ముంబై చూసే అవకాశం ఉంది. 


ముంబై రిటెన్షన్ జాబితా: 
రోహిత్ శర్మ, టీమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, రమణదీప్ సింగ్, తిలక్ వర్మ,ఇషాన్ కిషన్, ట్రిస్టాన్ స్టబ్స్, జోఫ్రా ఆర్చర్, జస్‌ప్రీత్ బుమ్రా, డెవాల్డ్ బ్రేవిస్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తీకేయ, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, ఆకాశ్ మద్వాల్‌, జాసన్ బెహ్రెండార్ఫ్. 


ముంబై రిలీజ్ జాబితా:
కీరన్ పోలార్డ్‌, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, జయదేవ్ ఉనాద్కత్, మయాంక్ మార్కండే, బసిల్ థంపి, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, రిలే మెరిడిత్, సంజయ్ యాదవ్‌, రాహుల్ బుద్ది, డానియల్ సామ్స్, టైమల్ మిల్స్‌. 


Also Read: RCB Retained Players List: ఆర్‌సీబీ రిటెన్షన్ జాబితా ఇదే.. హైదరాబాద్ కమీషనర్ కుమారుడు ఔట్!  


Also Read: IPL 2023 Retention: ఐపీఎల్ 2023 రిటెన్షన్ పూర్తి, ఏ ఫ్రాంచైజీ పర్సులో ఎంత డబ్బుంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook