IPL 2024 Auction List: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ 2024 వేలం ఈసారి తొలిసారిగా విదేశీ గడ్డపై జరగనుంది. మద్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఐపీఎల్ 2024 వేలం జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఏ ఫ్రాంచైజీ పర్సులో ఎంత మిగిలుంది, ఎన్ని ఖాళీలున్నాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2024 వేలం మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనబోతున్నాయి. అన్ని జట్లకు కలిపి 77 స్లాట్స్ ఖాళీ ఉంటే మొత్తం 333 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ఇందులో 214 మంది భారతీయ ఆటగాళ్లుంటే, 119 మంది విదేశీయులున్నారు. గుజరాత్ టైటాన్స్ జట్టు వద్ద అత్యధికంగా  38.15 కోట్ల రూపాయలున్నాయి. ఆ తరువాత రెండవ స్థానంలో 34 కోట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉంది. ఇక మూడవ స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 32.7 కోట్లు కలిగి ఉంది. నాలుగో స్థానంలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు వద్ద 31.4 కోట్లున్నాయి. ఐదవ స్థానంలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ వద్ద 29.10 కోట్లున్నాయి. 


గుజరాత్ టైటాన్స్ జట్టు వ్యాలెట్‌లో 38.15 కోట్లుండగా గరిష్టంగా 8 మందిని కొనుగోలు చేయవచ్చు. ఇందులో రెండు విదేశీ ఆటగాళ్ల స్థానాలున్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద 34 కోట్లుండగా గరిష్టంగా 6 మందిని తీసుకోవచ్చు. ఇందులో విదేశీ ఆటగాళ్ల సంఖ్య 3. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు వద్ద 32.7 కోట్లుండగా గరిష్టంగా 12 మందిని తీసుకోవచ్చు. ఇందులో విదేశీ ఆటగాళ్ల సంఖ్య 4. ఇక చెన్నై సూపర్‌కింగ్స్ వద్ద 31.4 కోట్లుండగా గరిష్టంంగా 6 మందిని తీసుకోవచ్చు.


పంజాబ్ కింగ్స్ లెవెన్ వద్ద 29.10 కోట్లుండగా ఈ జట్టు గరిష్టంగా 8 మందిని తీసుకోవచ్చు. వీరిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లుండాలి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద 23.25 కోట్లుండగా గరిష్టంగా 7 మందిని తీసుకోవచ్చు. వీరిలో నలుగురు విదేశీ ఆటగాళ్లకు అవకాశముంటుంది. ఢిల్లీ కేపిటల్స్ వద్ద 28.95 కోట్లుంటే గరిష్టంగా 9 మందిని తీసుకోవచ్చు. ఇందులో విదేశీ ఆటగాళ్లు నలుగురికి అవకాశముంటుంది. 


రాజస్థాన్ రాయల్స్ జట్టు వద్ద 14.5 కోట్లుంటే గరిష్టంగా 8 మందిని తీసుకోవచ్చు. వీరిలో విదేశీ ఆటగాళ్లు ముగ్గురికి అవకాశముంటుంది. లక్నో సూపర్ జెయింట్స్ వద్ద అత్యల్పంగా 13.15 కోట్లుంటే గరిష్టంగా 6 మందిని తీసుకోవచ్చు. వీరిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లుండవచ్చు. ముంబై ఇండియన్స్ వద్ద 17.75 కోట్లుంటే గరిష్టంగా 8 మందిని తీసుకోవచ్చు. వీరిలో నాలుగు విదేశీ ఆటగాళ్ల స్థానాలున్నాయి.


అందరి దృష్టి ఆ ఐదుగురిపైనే


వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్సన కనబర్చిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, దక్షిణాఫ్రికా సంచలన పేసర్ కోయెట్జీలపైనే అందరి దృష్టీ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఐదుగురు ఆటగాళ్లు ఈసారి వేలంలో భారీ దర పలకనున్నారు. 


Also read: IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఖరారైందా, టోర్నీ ఎప్పట్నించి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook