IPL 2024- Chennai Super Kings: ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచులు ఆడి నాల్గింటిలో గెలిచి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. వరుస విజయాలతో జోరుమీదున్న సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా సీజన్ మెుత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి ముందే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌టెస్టు సిరీస్‌లో కాన్వే ఎడమేచతి బొటన వేలికి తీవ్ర గాయమైంది. దానికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఐపీఎల్ సమయానికి కాన్వే కోలుకుంటాడని సీఎస్కే యాజమాన్యం భావించింది. కానీ అతడు కోలుకోలేదు. దీంతో అతడు ఈ సీజన్ మెుత్తానికి దూరమయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాన్వే గత ఐపీఎల్ సీజన్ లో పరుగుల వరద పారించాడు. 51.69 స‌గ‌టుతో 672 ప‌రుగులు చేశాడు. 139.71 స్ట్రైక్ రేట్ కలిగిన అతడు ఆరు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. తాజాగా కాన్వే స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ గ్లీసన్‌ను సీఎస్కే జట్టులోకి తీసుకుంది. అయితే రుతురాజ్ సేన బ్యాటర్ స్థానంలో బౌలర్ ను తీసుకోవడం విశేషం. రిచర్డ్ గ్లీసన్‌ 2022లో టీమిండియాపైనే ఆరంగ్రేటం చేశాడు. కేవలం నాలుగు బంతుల్లోనే భారత స్టార్ బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌ల వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ గ్లీసన్‌కు ఇది తొలి ఐపీఎల్ సీజన్. అయితే గతంలో అతడు పలు టీ20 టోర్నీల్లో పాల్గొన్నాడు. ఈ సీజ‌న్‌లో గ్లీస‌న్‌కు చెన్నై ఫ్రాంచైజీ రూ.50 లక్ష‌లు చెల్లించ‌నుంది. మరి ఇతడు తుది జట్టులో ఉంటాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. 


Also Read: IPL 2024: ఐపీఎల్‌లో దుమ్మురేపుతున్న టాప్-5 భారత అన్‌క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..!


Also Read: IPL Points Table: పాయింట్ల పట్టికలో ఢిల్లీకి ప్రమోషన్.. సన్ రైజర్స్ స్థానం ఎంతంటే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter