IPL 2024 KKR vs SRH Final: వర్షంతో మ్యాచ్ రద్దయితే పరిస్థితేంటి, విజేత ఎవరు
IPL 2024 KKR vs SRH Final: ఐపీఎల్ 2024 సీజన్ 17 ఇవాళ్టితో ముగియనుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఇవాళ ఫైనల్ పోరు జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్జంకిగా మారనున్నాడా, ఒకవేళ వర్షంతో రద్దయితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా విన్పిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 KKR vs SRH Final: ఐపీఎల్ 2024 సీజన్ 17 ఫైనల్ పోరుకై ఇవాళ చెన్నై చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల ప్రాక్టీసుకు ఆకశ్మిక వర్షం అంతరాయం కల్గించిన నేపధ్యంలో ఫైనల్ పరిస్థితి ఏంటనే ఆందోళన రేగుతోంది. ఇవాళ వర్షసూచన ఉందా లేదా, ఒకవేళ ఉంటే పరిస్థితి ఏంటనేది ప్రతి అభిమానిని కలచివేస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
రెండు నెలల్నించి వినూత్న సంచలనాలు నమోదవుతున్న ఐపీఎల్ 2024 సీజన్ 17 తుది సమరం ఇవాళ జరగనుంది. చెన్నై చెపాక్ స్డేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. వర్షం సూచనలు లేకపోయినా నిన్న ప్రాక్టీసు మ్యాచ్ సందర్భంగా ఆకశ్మికంగా వర్షం పడటంతో ఇవాళ ఏం జరగనుందోననే టెన్షన్ మొదలైంది. నిన్న ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రాక్టీస్ మ్యాచ్‌కు రెండు జట్లు దూరమయ్యాయి. ఫైనల్ పోరుకు సిద్ధం చేసిన స్డేడియంలోని నాలుగో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. వాస్తవానికి ఇవాళ వాతావరణం ఆకాశం మేఘావృతమై హ్యుమిడిటీ అధికంగా ఉంటుంది. వర్షసూచనైతే లేదు. ఒకవేళ పడినా కాస్త చినుకులు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అయితే బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ వైపు ఏర్పడిన రెమాల్ తుపాను, నైరుతి రుతుపవనాల ప్రభావంతో హఠాత్తుగా వాతావరణం మారే అవకాశాలుండవచ్చనే అనుమానాలున్నాయి.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే
ఒకవేళ హఠాత్తుగా వర్షం ప్రారంభమై మ్యాచ్ రద్దయితే రిజర్వ్ రేడ్ రేపు మే 27న ఎలాగూ ఉంది. రేపటి వాతావరణం అనకూలించవచ్చు. మ్యాచ్ జరగుతుండగా వర్షం కారణంగా నిలిచిపోతే డక్‌వర్త్ లెవిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను కుదిస్తారు. రిజర్వ్ డే మ్యాచ్ కూడా వర్షం కారణంగా జరగకుంటే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను జట్టును విజేతగా ప్రకటిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook