IPL 2024 Playoffs KKR vs SRH: రెండు నెలలుగా జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ 17 మొట్టమొదటి ప్లే ఆఫ్ ఇవాళ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ జట్ల మధ్య జరిగే ఇవాళ్టి ప్లే ఆఫ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశముంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2024 సీజన్ 17 ముగింపు కేవలం నాలుగు మ్యాచ్‌ల దూరంలో ఉంది. ఇవాళ జరిగే తొలి ప్లే ఆఫ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. దెక్కన్ ఛార్జర్స్‌గా తొలిసారి, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మరోసారి టైటిల్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్..2012,2014 టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇవాళ తలపడనుంది. బ్యాటింగ్ పరంగా రెండు జట్లూ పటిష్టంగా ఉన్నాయి. కేకేఆర్ జట్టుతో పోలిస్తే సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ లైనప్ అద్బుతంగా ఉంది. అభిషేక్, ట్రావిస్ హెడ్ నుంచి హెన్రిచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ ఇలా అందరూ బౌలర్లపై విరుచుకుపడేవారే కావడం గమనార్హం. 


అటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ వెళ్లిపోవడం ఆ జట్టుకు దెబ్బే. కానీ సునీల్ నరైన్ మంంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు ఈసారి. వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్, రింకూ సింగ్‌లు అడపాదడపా బ్యాట్ ఝులిపించేవారే. ఇక బౌలింగ్ పరంగా చూస్తే సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్ దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్‌లను ఎదుర్కోవడం కష్టమే కావచ్చు. 


ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ విభాగంలో మంచి మంచి బౌలర్లు ఉన్నారు కానీ నిలకడ లేకపోవడం ఆ జట్టును బాధిస్తోంది. ఏ ఒక్క బౌలర్ కూడా నిలకడగా రాణించలేని పరిస్థితి. ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ వంటి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలిగితే ఎస్ఆర్‌హెచ్ విజయాన్ని ఎవరూ ఆపలేకపోవచ్చు.


అహ్మదాబాద్ పిచ్ అనేది అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. మొదటి బ్యాటింగ్ చేసినవారికి కాస్త అనుకూలంగా ఉండవచ్చు. ఈ పిచ్‌పై ఈ సీజన్‌లో జరిగిన ఆరు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లలో 200 దాటి స్కోర్ నమోదైంది. గుజరాత్ టైటాన్స్ 89, డిల్లీ 92 పరుగుల అతి స్వల్ప స్కోరు కూడా ఇక్కడే నమోదైంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఇవాళ్టి మ్యాచ్‌కు వర్షసూచన లేదు. 


ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ 26 సార్లు తలపడగా 17 సార్లు కేకేఆర్, 9 సార్లు ఎస్ఆర్‌హెచ్ విజయం సాధించాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఒకసారే తలపడ్డాయి. నైట్‌రైడర్స్ కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


సన్‌రైజర్స్ హైదారాబాద్ అంచనా


ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, సన్వీర్, భువనేశ్వర్, విజయకాంత్, నటరాజన్


కోల్‌కతా నైట్‌రైడర్స్ అంచనా


శ్రేయస్ అయ్యర్, సునీల్ నరైన్, గుర్బాజ్ అహ్మద్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రూ రస్సెల్, రమణ్ దీప్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ లేదా వైభవ్


Also read: IPL 2024 Playoffs: ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్ ఇదే.. ఆ జట్టుకు మరో ఛాన్స్..!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook