Ishan Kishan superman video viral: ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ సూపర్ మ్యాన్ డ్రెస్ ధరించి ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.  ఇషాన్ యెుక్క ఈ వింత కాస్ట్యూమ్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే అతడు ఆ సూపర్ మ్యాన్ సూట్ ధరించడం వెనుక కారణం వింటే మీకు నవ్వరాక మానదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇషాన్ కిషన్ ఈ దుస్తులు వేసుకోవడానికి గల కారణాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. ఫ్రాంచైజీ ప్రకారం, కిషన్ ఈ డ్రెస్ ధరించడం వినోదం కోసం కాదు, అది అతడికి శిక్ష. జట్టు సమావేశాలకు ఆలస్యంగా వచ్చే క్రికెటర్లకు ముంబై ఇండియన్స్ ఇలాంటి ఫనిష్మెంట్ ఇస్తుందని ఎక్స్ లో పేర్కొంది. ఇషాన్‌కి మాత్రమే కాదు స్పిన్నర్లు కుమార్ కార్తికేయ, షామ్స్ ములానీ, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారాలకు కూడాఇదే శిక్ష పడింది. వారు కూడాఅదే సూపర్ మ్యాన్ గెటప్ లో హోటల్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. 


రాణించలేకపోతున్న కిషన్..
హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో ఓడింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆ జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. ఇందులో ఇషాన్ కిషాన్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడిందేమీ లేదు. అతడు మూడు మ్యాచుల్లో 16.67 సగటుతో కేవలం 50 పరుగులే చేశాడు. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. గత సీజన్లో అద్భుతంగా ఆడిన ఇషాన్ ఈ సీజన్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు.  2023 ఐపీఎల్ సీజన్ లో 16 మ్యాచ్‌ల్లో 30.27 సగటుతో మొత్తం 454 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 142.77గా ఉంది .



Also Read: Mayank yadav: ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా లక్నో స్పీడ్ గన్... అసలు ఎవరీ మయాంక్ యాదవ్?


Also Read: RCB Vs LSG Live: బ్యాటింగ్‌తో డికాక్‌ బీభత్సం.. బెంగళూరుపై లక్నో అద్భుత విజయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి