Mayank yadav: ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా లక్నో స్పీడ్ గన్... అసలు ఎవరీ మయాంక్ యాదవ్?

Mayank yadav: ఆ యువ బౌలర్ కు స్పీడ్ కు స్టార్ బ్యాటర్లు సైతం వణికిపోతున్నాడు. 150 కిమీ వేగంతో రాకెట్ లా దూసుకొస్తున్న అతడి బంతులకు ప్రత్యర్థ బ్యాటర్లు సమాధానం చెప్పలేక చేతులెత్తిస్తున్నారు. ఇప్పుడు అతడే ఐపీఎల్ లో హాట్ టాఫిక్. ఇంతకీ ఆ క్రికెట్ ఎవరు, అతడి లైఫ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Last Updated : Apr 3, 2024, 02:48 PM IST
Mayank yadav: ఐపీఎల్ లో హాట్ టాపిక్ గా లక్నో స్పీడ్ గన్... అసలు ఎవరీ మయాంక్ యాదవ్?

Mayank yadav life story: ఇండియన్ క్రికెట్ లో సంచలనంగా మారాడు మయాంక్ యాదవ్. ఈ యంగ్ కుర్రాడు ఐపీఎల్  17వ సీజన్‌లో దుమ్మురేపుతున్నాడు. లక్నో తరపున ఆడుతున్న ఈ క్రికెటర్ తన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఇతడు గంటకు 150 కి.మీ వేగంతో బంతులేసి స్టార్ ప్లేయర్లను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆడిన రెండు మ్యాచుల్లోనే ఆరు వికెట్లు తీసి 'ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను గెలుచుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికవ్వడం పట్ల మయాంక్ ఆనందం వ్యక్తం చేశాడు. టీమిండియాకు ఆడటమే తన లక్ష్యంగా పేర్కొన్నాడు. 

అసలు ఎవరీ మయాంక్ యాదవ్?
మయాంక్ యాదవ్ బీహార్‌లోని సుపాల్ జిల్లాకు చెందినవాడు. 21 ఏళ్ల మయాంక్ యాదవ్ క్రికెట్ నేర్చుకోవడానికి 14 ఏళ్ల వయసులో ఢిల్లీలోని సోనేట్ క్లబ్ కు వచ్చాడు. అక్కడే తన చిన్ననాటి కోచ్ తారక్ సిన్హాను కలిశాడు. ఫ్రాక్టీసులో మయాంక్ బౌలింగ్ కు తొటి బ్యాటర్లు భయపడేవారు. అతనిలో ఏదో విషయం ఉందని గమనించిన తారక్ సిన్హా అతడిని ప్రోత్సాహించాడు. అతడి టాలెంట్ చూసి కోచ్ ఫీజు కూడా తీసుకునే వాడని కాదని సిన్హా అసిస్టెంట్ దేవేంద్ర శర్మ తెలిపాడు. ఈ సందర్భంగా పాత రోజులను గుర్తు చేసుకున్నాడు దేవేంద్ర. మయాంక్ తన తండ్రి (ప్రభు)తో కలిసి క్లబ్ కు వచ్చినప్పుడు.. అతడిలో ఢిల్లీకి ఆడాలనే సంకల్పాన్ని నేను తొలిసారి గమనించాను. సిన్హా గారి మార్గదర్శకత్వంలో అతడు ఈ స్థాయికి చేరుకోవడం ఆనందం ఉందని దేవేంద్ర అన్నాడు.

Also Read: RCB Vs LSG Live: బ్యాటింగ్‌తో డికాక్‌ బీభత్సం.. బెంగళూరుపై లక్నో అద్భుత విజయం

మయాంక్ ఐపీఎల్ ఆడటంలో​ అతడిదే కీలకపాత్ర..
రెండేళ్ల కిందట విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా నెట్స్‌లో మయాంక్‌ను చేశాడు విజయ్ దహియా. అతడి స్పీడ్ బౌలింగ్ కు ఫిదా అయ్యాడు. అప్పటికే మయాంక్ ఢిల్లీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. లక్నో ఫ్రాంచైజీతో కలిసి పనిచేస్తున్న దహియా మయాంక్‌ను ఎలాగైనా టీమ్ లోకి తీసుకోవాలని భావించాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో లక్నో తరపున మయాంక్ ఆడటంలో విజయ్ దహియా కీ రోల్ ప్లే చేశాడు. అతడి నమ్మకమే ఇప్పుడు లక్నో విజయాలను అందిస్తుంది. ఈ లక్నో స్పీడ్ స్టార్ పై దిగ్గజాల సైతం ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. వెస్టిండీస్‌కు చెందిన మాజీ ఫాస్ట్ బౌలర్, కామెంటేర్ ఇయాన్ బిషప్ అయితే పవన పుత్రుడిలా బౌలింగ్ చేస్తున్నాడంటూ ప్రశంసించాడు. 

Also Read: Deepthi Sunaina: పరువాలతో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైనా, లేటెస్ట్ ఫోటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News