IPL 2024 Tickets: మార్చ్ 22 నుంచి ఐపీఎల్ 2024 మొదలు కానుంది. గత సీజన్‌లో విక్రయించినట్టే ఈసారి కూడా అధికారిక ఆన్‌లైన్ వేదికలైన పేటీఎం, బుక్ మై షో ద్వారా ఐపీఎల్ 2024 టికెట్లు విక్రయం కానున్నాయి. ఐపీఎల్ 2024 టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలనే వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. త్వరలో అంటే మార్చ్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ల 2024 టికెట్లు ఆన్‌లైన్‌లో పేటీఎం, బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఐపీఎఎల్ టీ20 అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశముంది. ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది బీసీసీఐ. నిర్దేశిత ప్లాట్‌ఫామ్‌లలో ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటికీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 


IPLT20 వెబ్‌సైట్ ద్వారా ఐపీఎల్ 2024 టికెట్లు ఎలా కొనుగోలు చేయవచ్చు


ముందుగా అధికారిక వెబ్‌సైట్ iplt20.com.ఓపెన్ చేయాలి. తరువాత బై ఐపీఎల్ 2024 టికెట్ ఆన్‌లైన్ క్లిక్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుుతంది. అక్కడ అడిగిన సమాచారం ఫిల్ చేయాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏదో ఒక పేమెంట్ విధానం ఎంచుకోవాలి. పేమెంట్ పూర్తయ్యాక టికెట్ జారీ అవుతుంది. 


పేటీఎం, బుక్ మై షో ద్వారా ఐపీఎల్ 2024 టికెట్ ఎలా కొనాలి


ముందుగా పేటీఎం లేదా బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి అందులో ఐపీఎల్ 2024 టికెట్ బుకింగ్ సెక్షన్ క్లిక్ చేయాలి. మీక్కావల్సిన మ్యాచ్‌పై టిక్ చేసి కావల్సిన ధర టికెట్ ఎంచుకోవాలి. అక్కడ అడిగిన కనీస సమాచారం ఫిల్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి. అంతే మీ టికెట్ జారీ అవుతుంది. 


ఐపీఎల్ 2024 టికెట్ ధరలు ఇలా


దేశంలోని వివిధ స్డేడియంలలో జరిగే ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల టికెట్ దరలు వేర్వేరుగా ఉన్నాయి. అంతేకాకుండా వివిధ కేటగరీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో స్డేడియం టికెట్ ఒక్కోలా ఉంటుంది. మీ సౌకర్యాన్ని బట్టి టికెట్ ధర మారుతుంటుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్డేడియంలో టికెట్ ధర 1500, 17000 కాగా, ముంబైలోని వాంఖేడ్ స్డేడియంలో టికెట్ ధర 2000, 25000గా ఉంది. అదే విధంగా రాజీవ్ గాంధీ స్డేడియంలో టికెట్ ధర 1500, 15000 గా ఉంది. చెన్నైలోని చిదంబరం స్డేడియంలో 2000,25000 గా ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ టికెట్ ధర 2300,22000 గా ఉంది. ఇక నరేంద్రమోదీ స్డేడియం టికెట్ ధర 1700,25000గా ఉంది. చిన్నస్వామి స్డేడియం టికెట్ ధర 2500, 27000 గా ఉంది. 


ఐపీఎల్ ఫ్రాంచైజీలు కెప్టెన్ వివరాలు


ఐపీఎల్ 2024కు సిద్ధమైన వివిధ ఫ్రాంచైజీలు, కెప్టెన్ వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా సారధ్యం వహించనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఎంఎస్ ధోని నేతృత్వంలో సిద్ధమౌతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫాఫ్ డుప్లెసిస్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సంజూ శామ్సన్ సారధ్యంలో బరిలో దిగుతున్నాయి. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు శ్రేయస్ అయ్యర్ సారధ్యంలో, పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు శిఖర్ ధావన్ నేతృత్వంలో ఉంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ నేతృత్వం వహిస్తుంటే..లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కేఎల్ రాహుల్ సారధ్యం వహిస్తాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభమన్ గిల్, ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు రిషభ్ పంత్ సారధ్యం వహించనున్నారు. 


Also read: SBI Recruitment 2024: ఎస్బీఐలో ఉన్నత కొలువులు, మార్చ్ 4 గడువు తేదీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook