RCB Retain List: వ్యాలెట్ పెరగాలంటే వేటు తప్పదు, 11 మందిని వదిలించుకున్న ఆర్సీబీ
RCB Retain List: ఐపీఎల్ 2024 వేలం కంటే ముందు రిటెన్షన్ జాబితాలు విడుదలయ్యాయి. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఊహించని షాక్ ఇచ్చాయి. పెద్దఎత్తున ఆటగాళ్లను వదిలించుకుంటున్నాయి. ఆర్సీబీ అయితే ఏకంగా 11 మందిని బయటకు పంపేసింది.
RCB Retain List: ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. బీసీసీఐ నిబంధన ప్రకారం ఇవాళ 4 గంటల్లోగా మొత్తం 10 ఫ్రాంచైజీ జట్లు తమ తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ జాబితాను బట్టి వేలానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు ఎవరు లేరనేది క్లారిటీ వస్తుంటుంది.
ఐపీఎల్ 2024 రిటెన్షన్ జాబితా విడుదలకు గడువు ముగిసింది. అన్ని జట్లు తమ తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాయి. ఎవరిని వదిలించుకుంచున్నాయో, ఎవరిని కొనసాగిస్తున్నాయో వెల్లడించాయి. దాదాపు అన్ని జట్లు పెద్దఎత్తున ఆటగాళ్లను వదిలించుకుంటూ షాక్ ఇచ్చాయి. అంటే ఈసారి వేలంలో ప్లేయర్లు భారీగానే ఉండనున్నారు. మూడు సార్లు ఫైనల్ వరకూ చేరినా టైటిల్ దక్కించుకోలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి పక్కా ప్లానింగ్‌తో ముందుకొస్తోంది. ప్రపంచకప్ హీరోలుగా మారిన కొంతమందిని టార్గెట్ చేసింది. ఈ స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవాలంటే వ్యాలెట్ పెంచుకోవాలి. అందుకే జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను పెద్దఎత్తున వదిలించుకుంటోంది. ఏకంగా 11 మందిని బయటకు పంపుతూ ఆర్సీబీ నిర్ణయం తీసుకుంది.
ఆర్సీబీ రిలీజ్ లిస్ట్
జోష్ హేజిల్‌వుడ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్ వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్ధ్ కౌల్, కేదార్ జాదవ్
ఆర్సీబీ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్
ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజిత్ పాటిదార్, అనూజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణశర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, వైషాక్ విజయ్ కుమార్, ఆకాశ్ దీప్, మొహమ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook