Hardik Reveals Reason For Not Bowling Against DC: ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. ఏప్రిల్ 07న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేన 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు స్కోరు ఏ ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయకుండానే రెండు వందల పరుగుల దాటడం విశేషం. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (39), టిమ్ డేవిడ్ (45), రొమారియో షెపర్డ్ (39) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం ఛేదనను ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన ముంబై ఇండియన్స్ కు ఢిల్లీపై విజయం భారీ ఊరట నిచ్చే ఉంటుంది. ముంబై ఇండియన్స్ గెలుపొందినప్పటికీ ముంబై ఫ్యాన్స్ లో ఒక డౌట్ మాత్రం మెుదలుతోంది. అదేంటంటే.. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మళ్లీ గాయపడ్డాడేమోననే సందేహం. ఎందుకంటే ఢిల్లీతో మ్యాచులో పాండ్యా బౌలింగ్ చేయకపోవడంతో ఈ అనుమానాలను మరింత రెట్టింపు చేశాయి. 


Also Read: Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై జట్టు.. టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు..


ముంబై కెప్టెన్ ఏమన్నాడంటే..
గతేడాది వన్డే వరల్డ్ కప్ సందర్భంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya injury) గాయపడ్డాడు. చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పాండ్యా ఐపీఎల్ తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీతో మ్యాచులో బౌలింగ్ చేయకపోవడంతో పాండ్యా గాయపడ్డాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు ముంబై కెప్టెన్. ఆదివారం మ్యాచ్ లో అంతా బాగానే జరగడంతో నేను బౌలింగ్ చేయలేదు. సరైన సమయంలో బౌలింగ్ చేస్తా అని హార్దిక్ పాండ్యా అన్నాడు. 


Also Read: Sunrisers Hyderabad: సన్ రైజర్స్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ కు దూరమైన స్టార్ ఆల్ రౌండర్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook