IPL 2024 Playoff Scenario: మారిపోయిన ఐపీఎల్ ప్లే ఆఫ్ లెక్కలు.. టాప్-4లో నిలిచే జట్లు ఇవే..!
IPL 2024 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో లెక్కలు మారిపోతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి ప్లేస్‌లో ఉంది. ప్లే ఆఫ్స్‌లో చేరేందుకు ఏ జట్టుకు అవకాశాలు ఉన్నాయి..? ముంబై ఇండియన్స్, ఆర్సీబీకి ఇంకా అవకాశాలు ఉన్నాయా..? పూర్తి లెక్కలు ఇవే..
IPL 2024 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ భారీ మ్యాచ్‌లతో ఫుల్ హీటెక్కుతోంది. బ్యాట్స్‌మెన్ల హావాతో బౌండరీలు చినబోతున్నాయి. సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాలు హోరెత్తుతున్నాయి. మ్యాచ్‌లు సాగుతున్న కొద్దీ ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారుతోంది. రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్‌లలో 8 విజయాలు, 16 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ దాదాపు ఫిక్స్ అవ్వగా.. ఒక మ్యాచ్‌లో విజయం సాధిస్తే అధికారికంగా అడుగుపెడుతుంది. ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు ప్లేఆఫ్స్ చేరుకోవడం కష్టంగా మారింది. ఈ రెండు జట్లు 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు, 6 పాయింట్లతో కింది నుంచి రెండోస్థానంలో ఉన్నాయి. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినా.. ఇతర జట్ల సమీకణాలు, నెట్‌రన్ రేట్ ఆధారంగా ముందుకువెళతాయి.
ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి.. ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే ఛాన్స్ ఉంటుంది. నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ ఓడిపోతే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకుంటుంది. ఆ తరువాత మూడు మ్యాచ్‌లు గెలిచినా.. 12 పాయింట్లతో ఇంటిముఖం పడుతుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్.. రెండు మ్యాచ్‌లు గెలిచినా ప్లేఆఫ్ రేసులో బెర్త్ ఫిక్స్ అవుతుంది.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఐదోస్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలిస్తే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. రెండు గెలిస్తే.. ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. మూడు గెలిచినా.. టాప్-4లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ రెండు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధిస్తే.. సాఫీగా ప్లేఆఫ్స్‌లో అడుగుపెడతాయి. గుజరాత్ టైటాన్స్ , పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో ఉన్నాయి. ఈ రెండు జట్లు తమ చివరి నాలుగు మ్యాచ్‌లన్నింటినీ గెలిస్తేనే అవకాశాలు ఉంటాయి. మూడు గెలిస్తే ఇతర సమీకరణాలు అనుకూలంగా ఉండాలి.
ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. రెండు గెలిస్తే.. ఇతర జట్ల గెలుపొటములపై ఆధారపడాల్సి ఉంటుంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలవడం పంత్ సేనకు కీలకంగా మారనుంది.
Also Read: 2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter