IPL 2024 Playoffs Schedule: ఐపీఎల్-17 సీజన్ చివరి దశకు చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్-4లో నిలిచాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. గౌహతిలో కుండపోత వర్షం కారణంగా టాస్ మూడు గంటలు ఆలస్యం కాగా.. మొదట 7 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. అయితే మళ్లీ వర్షం కురవడంతో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ రద్దయింది. ఈ మ్యాచ్‌ రద్దవ్వడం ఎస్‌ఆర్‌హెచ్‌కు కలిసి రాగా.. రాజస్థాన్‌కు దురదృష్టం వెంటాడింది. మ్యాచ్ రద్దుతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. రాజస్థాన్ మూడోస్థానానికే పరిమితమైంది. మొదటి స్థానంలో కేకేఆర్ నిలవగా.. నాలుగో స్థానంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిలిచింది. లీగ్ దశ ముగియడంతో ప్లేఆఫ్ షెడ్యూల్‌లు విడుదలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Nani: నాని నో చెప్పిన సినిమా.. తమిళ్ హీరోతో షూటింగ్ మొదలు


రాజస్థాన్ రాయల్స్ టాప్-2కి చేరుకోవాలంటే.. కచ్చితంగా కోల్‌కతాను ఓడించాల్సి ఉంది. అయితే వర్షార్పణం కావడంతో 17 పాయింట్లతో మూడోస్థానంతోనే సరిపెట్టుకుంది. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో నాలుగోస్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. అంతకుముందు తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి రెండో స్థానానికి చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. క్వాలిఫయర్-1లో టేబుల్ టాపర్ కేకేఆర్‌తో పోటీ పడనుంది.


క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో జరుగుతాయి. క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో ఛాన్స్‌ ఉంటుంది. ఇక రాజస్థాన్, ఆర్‌సీబీ జట్లు ఎలిమినేటర్‌లో ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు, క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టుతో పోటీ పడుతుంది. క్వాలిఫైయర్-2లో గెలిచిన టీమ్‌ ఫైనల్‌లో అడుగుపెడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి తప్పుకుంటుంది.
 
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇలా..


==> క్వాలిఫైయర్-1: కోల్‌కతా Vs హైదరాబాద్, మే 21, అహ్మదాబాద్
==> ఎలిమినేటర్: బెంగళూరు Vs రాజస్థాన్, మే 22, అహ్మదాబాద్
==> క్వాలిఫైయర్-2: క్వాలిఫయర్-1 ఓడిపోయిన జట్టు Vs ఎలిమినేటర్‌లో విజేత, మే 24, చెన్నై
==> ఫైనల్: క్వాలిఫైయర్ 1 విజేత Vs క్వాలిఫైయర్ 2 విజేత, మే 26, చెన్నై.


ఇక పాయింట్ల పట్టిక విషయానికి వస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్ 20 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలవగా.. సన్‌రైజర్స్, రాజస్థాన్ 17 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. బెంగళూరు 14 పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో టాప్-4లో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ (14), ఢిల్లీ క్యాపిటల్స్ (14), లక్నో సూపర్ జెయింట్స్ (14), గుజరాత్ టైటాన్స్ (12), పంజాబ్ కింగ్స్ (10), ముంబై ఇండియన్స్ (8) ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.  


Read more: IPL 2024 RR vs KKR: రాజస్థాన్‌ ఆశలపై నీళ్లు.. వర్షం కారణంగా కేకేఆర్‌తో‌ మ్యాచ్‌ రద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter