Nani: నాని నో చెప్పిన సినిమా.. తమిళ్ హీరోతో షూటింగ్ మొదలు

Nani Upcoming Movies : ఒక హీరో వద్దు అనుకున్న కథ మరొక హీరో కావాలి అనుకోని చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే నాని చేయాల్సిన ఒక సినిమా తాజాగా ఇప్పుడు ఒక తమిళ్ స్టార్ హీరో చేతికివెళ్ళింది. తమిళ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి రాసుకున్న కథ తో నానిని ఇంప్రెస్ చేయలేకపోయారు కానీ శివ కార్తికేయన్ తో పట్టాలెక్కించనున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 20, 2024, 03:00 PM IST
Nani: నాని నో చెప్పిన సినిమా.. తమిళ్ హీరోతో షూటింగ్ మొదలు

Siva Karthikeyan Upcoming Movies: ఒక హీరో వద్దు అన్న కథలు మరొక హీరోల దగ్గరికి వెళ్లడం కొత్తేమీ కాదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చేయాల్సిన సినిమాలు కూడా ఒక్కోసారి ఇచ్చిన హీరోల వద్దకు వెళుతూ ఉంటాయి. మరి కొన్నిసార్లు చిన్న హీరోల చేయాల్సిన సినిమాలు స్టార్ హీరోలు ఎంపిక చేసుకుంటుంటారు. 

కొన్నిసార్లు ఒక హీరో వద్దు అన్న సినిమా మరొక హీరో వద్దకు వెళ్లి బ్లాక్ బస్టర్ అవచ్చు. కొన్నిసార్లు సినిమా ఫ్లాప్ కూడా అవ్వచ్చు. ఉదాహరణకి అతడు సినిమా పవన్ కళ్యాణ్ చేయాల్సింది. కానీ అది మహేష్ బాబు కెరియర్ ను మలుపు తిప్పిన సినిమా అయింది. 

కొన్ని నెలల క్రితం నాచురల్ స్టార్ నాని కి తమిళ్ డైరెక్టర్ శిబి చక్రవర్తి ఒక కథ లైన్ చెప్పారు. నానికి కూడా అది బాగా నచ్చింది. ఫుల్ వర్షన్ కథ కోసం హైదరాబాదులో ఒక ఆఫీస్ తీసి పనులు కూడా చేశారు. కానీ ఫైనల్ వర్షన్ మాత్రం కుదరలేదు. దీంతో నాని ఆ ప్రాజెక్టుకి నో చెప్పేసాడు. కట్ చేస్తే అదే సినిమా కథని పూర్తి చేసి శిబి చక్రవర్తి తమిళ్ హీరో శివ కార్తికేయన్ తో సినిమాని పట్టాలు ఎక్కిస్తున్నారు. 

డాన్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ ఇచ్చినా కారణంగా శివ కార్తికేయన్ ఈ సినిమాకి ఓకే చెప్పారట. నాని కూడా ఒక ఫంక్షన్ కి చెన్నై వెళ్ళినప్పుడు శివ కార్తికే ఎంతో కథలో చిన్న మార్పులు చేస్తే మంచి సినిమా అవుతుంది అని చెప్పారట. అది కూడా శివ కార్తికేయన్ ఓకే చెప్పడానికి ఒక కారణమైంది.

రష్మిక మందన్న ను ఈ సినిమాకి హీరోయిన్ గా అనుకుంటున్నారట. డేట్లు కుదిరితే ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సినిమా గురించిన మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

శివ మొదలవడానికి కొన్ని నెలల టైం అయితే పడుతుంది. అని అనుకున్నట్లు జరిగితే దసరా లేదా దీపావళికి ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. అలా నాని నో అన్నా కథ చివరికి శివ కార్తికేయన్ చేతుల్లోకి వెళ్ళింది. మరి శివ కార్తికేయన్ కి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News