IPL 2024 RR vs KKR Match Abandoned: ఇండియన్ ప్రీమియర్ తాజా సీజన్‌లో వర్షం కారణంగా మూడో మ్యాచ్ రద్దయ్యింది. ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఫలితంగా గౌహతి స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ ఆగిపోయింది. ప్లేఆఫ్స్‌కు మొదట చేరిన రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరొక పాయింట్లు ఇచ్చారు.
మ్యాచ్ రద్దుతో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు వచ్చిన నష్టం ఏమీ లేకపోగా రాజస్థాన్ రాయల్స్‌కు మాత్రం ఒక అవకాశం చేజారింది. మ్యాచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచేది. తొలి క్వాలిఫయర్‌లో మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడాల్సి వచ్చేది. కానీ మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ వేసుకుని మూడో స్థానంలో నిలిచింది. ఫలితంగా రెండో క్వాలిఫయిర్‌లో ఆడాల్సి వచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంటికి వెళ్లాల్సిందే.
Also Read: IPL 2024 PBKS vs SRH: హైదరాబాద్ తడాఖా.. పంజాబ్‌పై విజయంతో రెండో స్థానానికి సన్‌రైజర్స్?
బరసప్ప స్టేడియంలో సాయంత్రం 7.30కు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. అంతుకుముందు నుంచే వర్షం భారీగా కురుస్తోంది. దీంతో టాస్ వేయకుండా ఆగిపోయారు. మధ్యలో కొంత విరామం ఇచ్చి మళ్లీ పడుతుండడంతో మ్యాచ్ నిర్వహించాలా? వద్దా అనే సంశయంలోకి వచ్చారు. ఆఖరకు పది గంటలకు కొంత తెరపినివ్వడంతో రిఫరీలు మ్యాచ్‌ను 7 ఓవర్లకు కుదించి టాస్ వేశారు.
Also Read: RCB Playoff: కోహ్లీని చూసి ఏడ్చేసిన అనుష్క శర్మ.. బెంగళూరు ప్లేఆఫ్స్ చేరికతో కన్నీళ్లు
టాస్ ప్రక్రియ పూర్తయి రాజస్థాన్ బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. మ్యాచ్ ప్రారంభమవుతున్న సమయంలో మళ్లీ వర్షం జోరందుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్, సంజూ శామ్‌సన్‌లను పిలిచిన అంపైర్లు, రిఫరీలు వారి అభిప్రాయం అడిగారు. వారిద్దరి అంగీకారంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఫలితంగా ఇరు జట్లకు చెరో ఒక పాయింట్ ఇచ్చారు. 20 పాయింట్లతో కేకేఆర్ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 9 నెగ్గి మూడు ఓడగా.. ఒక మ్యాచ్ రద్దయ్యింది. రాజస్థాన్ విషయానికి వస్తే 8 మ్యాచ్‌లు గెలిచి 5 ఓడి.. ఒక మ్యాచ్ రద్దుతో 17 పాయింట్లు పొంది మూడో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే కేకేఆర్‌తో తొలి క్వాలిఫయర్‌ను రాజస్థాన్ ఆడేది. మ్యాచ్ రద్దుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ అవకాశాన్ని కొట్టేసింది. నాలుగో స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌ను రాజస్థాన్ ఆడనుంది. ఇరు జట్లు ట్రోఫీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక రోజు విరామం అనంతరం అహ్మదాబాద్ స్టేడియం వేదికగా మే 21వ తేదీన తొలి క్వాలిఫయర్ కోల్‌కత్తా, హైదరాబాద్ మధ్య జరగనుంది. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుండగా.. ఓడిన మ్యాచ్ రెండో క్వాలిఫయర్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేత అయిన జట్టు ఫైనల్‌లో ఆడే అవకాశం దక్కించుకుంటుంది. మరి ఫైనల్‌లో ఎవరు సత్తా చాటి ఈసారి ట్రోఫీ సాధిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter