IPL 2024-Yuzvendra Chahal: ఐపీఎల్ హిస్టరీలో వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన యుజ్వేంద్ర చాహల్.. ఇప్పుడు మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. ఈ మెగా టోర్నీలో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ రెండో స్థానంలో నిలిచాడు. 150 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన చాహల్ ఇప్పటివరకు 200 సిక్సర్లు ఇచ్చాడు. ఈ చెత్త జాబితాలో పీయూష్ చావ్లా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. 184 ఇన్నింగ్స్‌లలో  బౌలింగ్ చేసిన చావ్లా 211 సిక్సర్లు ఇచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు చాహల్ ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువగా వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. అతడు ఇప్పటి వరకు 198 వికెట్లు పడగొట్టాడు. మరో రెండు వికెట్లు తీస్తే 200 మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్ గా అరుదైన ఘనతను సాధిస్తాడు. ఇక ఐపీఎల్ 17వ సీజన్ లో చాహల్ టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. నిన్న పంజాబ్ తో మ్యాచ్ లో వికెట్ తీయడం ద్వారా ఈ రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో నిలిచాడు. అతడు ఆరు మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. ఇతడి తర్వాత స్థానంలో ముంబై స్టార్ పేసర్ బుమ్రా ఉన్నాడు. 


ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు..
ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ హవా కొనసాగుతోంది. ఆల్ రౌండ్ షోతో అదరగొడుతూ దూసుకుపోతుంది రాయల్స్. శనివారం పంజాబ్ తో మ్యాచ్ గెలవడం ద్వారా మరోసారి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా ఈ మ్యాచ్ కు శిఖర్ ధావన్ దూరమయ్యాడు. సామ్ కరణ్ కెప్టెన్ గా వ్యవహారించాడు. ఓపెనర్లు తైడే, బెయిర్ స్టో చెరో 15 పరుగులు చేసి ఔటయ్యారు. 


ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్లు పెవిలియన్ చేరారు. జితేష్ శర్మ(29), లివింగ్ స్టోన్(21), అశుతోష్ శర్మ(31) రాణించడంతో ఓ మోస్తరు లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. 148 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఓపెనర్లు జైస్వాల్(39), కోటియన్(24) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత పరాగ్(23), హెట్మయిర్(27) కూడా రాణించడంతో రాయల్స్ 19.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో రబాడా, కరణ్ రెండేసి వికెట్లు తీశారు. 


Also Read: Kavya Maran: ఆ ప్లేయర్‌తో కావ్య మారన్ లిప్ టు లిప్ కిస్.. డీప్‌ ఫేక్ వీడియో వైరల్


Also Read: Sanju Samson Wife: సంజూ శాంసన్ భార్య ముందు అనుష్క శర్మ, ధనశ్రీ చాహల్ కూడా ఎందుకు పనికిరారు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి