IPL 2024: సిద్ధి వినాయకుడికి పూజలు చేసిన ఆర్సీబీ క్రికెటర్లు.. వైరల్ అవుతున్న ఫోటోలు..
IPL 2024: ముంబైతో జరగబోయే మ్యాచ్ లో గెలవాలని ఆర్సీబీ ప్లేయర్ సిద్ధి వినాయకుడి ఆలయంలో పూజలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
RCB players visited Shree Siddhivinayak Temple: ఈ ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ జట్టు ఇప్పటికే ఐదు మ్యాచులు ఆడగా.. నాల్గింటిలో ఓడిపోయింది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. టైటిల్ రేసులో నిలవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్ ఆర్సీబీ గెలవాల్సి ఉంటుంది. కింగ్ కోహ్లీ రాణిస్తున్నప్పటికీ.. మిగతా బ్యాటర్లు విఫలమవ్వడం, అనుకున్న స్థాయిలో బౌలర్లు బౌలింగ్ చేయలేకపోవడం ఆ జట్టు ఓటమి కారణాలు. ఆర్సీబీ తన తర్వాత మ్యాచ్ ను ముంబై ఇండియన్స్‌తో ఆడబోతుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కు ముఖ్యమైనది. ఎందుకంటే ఇరు జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి.
ఆ మ్యాచ్ కోసం ఇప్పటికే ముంబై చేరుకున్న ఆర్సీబీ ఆటగాళ్లు అక్కడి సిద్ధి వినాయకుడి(Sidhi Vinayaka) ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తమ జట్టు విజయం సాధించాలని వారు కోరుకున్నారు. స్వామిని దర్శించుకున్న వారిలో మహిపాల్ లొమ్‌రోర్, పేసర్ విజయ్ కుమార్, సుయాశ్ ప్రభుదేశాయ్‌లు ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన డూప్లెసిస్ సేన ఈసారి ఏం చేస్తుందో చూడాలి. ఈ మ్యాచ్ ఏప్రిల్ 11వ తేదీన జరగబోతుంది.
Also Read: Hardik Pandya: ఢిల్లీతో మ్యాచ్ లో హార్దిక్ ఎందుకు బౌలింగ్ చేయలేదు? అతడి గాయం మళ్లీ తిరగబెట్టిందా?
ఆర్సీబీ జట్టు
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, రెహ్మద్ సిరాజ్, టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
Also Read: Mumbai Indians: చరిత్ర సృష్టించిన ముంబై జట్టు.. టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook