Rohit Sharma viral video: ఐపీఎల్ 29వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ సెంచరీ చేసినా ముంబై జట్టుకు గెలుపును అందించలేకపోయాడు. పతిరనా అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నై జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో సీఎస్కే 20 పరుగుల తేడాతో హార్దిక్ సేనను ఓడించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ చేసిన ఓ పని అందరినీ ఆకట్టుకుంది. సీఎస్కే బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తున్నారు. మ్యాచ్ 12వ ఓవర్లో మూడో బంతికి రుతురాజ్ గైక్వాడ్ లెగ్ సైడ్‌కు తగిలింది. బౌండరీ లైన్ నుంచి పరుగెత్తిన రోహిత్ శర్మ డైవింగ్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ ప్యాంట్ జారిపోయింది. అయినా సరే హిట్‌మ్యాన్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన నెట్టింట వైరల్ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 రోహిత్ సెంచరీ వృథా.. చెన్నైదే విజయం..
నిన్న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది. టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 రన్స్ చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (69), శివమ్‌ దూబే (66) అర్థశతకాలతో రాణించారు. చివరి ఓవర్ లో అయితే ధోని దుమ్ముదులిపేశాడు. హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి జట్టుకు మంచి స్కోరును అందించాడు. ఆనంతరం లక్ష్యచేధనను ప్రారంభించిన ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. మతిసా పతిరనా అద్భుతంగా బౌలింగ్ చేసి చెన్నైకు విజయాన్ని అందించాడు. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 11 ఫోర్లు ఉండటం విశేషం. 



Also Read: MI vs CSK Match: లైవ్ మ్యాచ్‌లో అంపైర్‌తో గొడవకు దిగిన బౌచర్, పొలార్డ్... వైరల్ అవుతున్న వీడియో..


Also read: RCB vs SRH Dream11 Prediction: ఆర్‌సీబీతో హైదరాబాద్ ఫైట్.. బలాబలాలు, తుది జట్లు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook