IPL 2024, RR vs MI live Updates : హోం గ్రాండ్ లో ముంబై ఇండియన్స్ తడబడుతోంది. వాంఖ‌డేలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బౌల‌ర్ల ధాటికి హార్దిక్ సేన వణుకుతోంది. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ పేస్ కు ముంబై బ్యాటర్లు దాసోహమంటున్నారు. బౌల్ట్ విజృంభించడంతో ముంబై ఇండియన్స్ 20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి నలుగురిలో ముగ్గురు డకౌట్ కావడం విశేషం. వీరందరినీ బౌల్డే ఔట్ చేశాడు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ చరిత్రలో ఇది ఆరోసారి..


ఐపీఎల్ హిస్టరీలో మెుదటి న‌లుగురు బ్యాటర్లలో ముగ్గురు బ్యాట‌ర్లు డ‌కౌట్ కావ‌డం ఇది ఆరోసారి. బౌల్ట్ త‌న తొలి ఓవ‌ర్లోనే రోహిత్ శ‌ర్మ‌(0) ను ఔట్ చేసి రాజస్థాన్ కు బ్రేక్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత బంతికి న‌మ‌న్ ధిర్‌(0)ను ఎల్బీగా బలిగొన్నాడు. దీంతో ముంబై ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక తన తర్వాత ఓవర్లో బౌల్డ్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌ బ్రెవిస్‌(0)ను పెవిలియన్ కు చేర్చాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ ఇషాన్ కిషాన్(16) ను బర్గర్ బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం తిలక్ వర్మ(31), డేవిడ్(6) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆ జట్టు 13 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 21 బంతుల్లో 34 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 


Also Read: MI Vs RR Live Score: టాస్ గెలిచిన సంజూ శాంసన్.. ముంబై ఈ సారైనా బోణీ కొట్టేనా?


Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌కు ఝలక్.. చెన్నై విజయం సాధించిన వెంటనే..!


రోహిత్ చెత్త రికార్డు..
హోం గ్రౌండ్ వాంఖడే లో కెప్టెన్ రోహిత్ శర్మ మరో చెత్త రికార్డును మటూగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో 17 సార్లు డ‌కౌట్ అయిన రెండో ఆటగాడిగా హిట్‌మ్యాన్ రికార్డు నెల‌కొల్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దినేశ్ కార్తీక్ తో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆర్సీబీ మరో ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 15 డ‌కౌట్‌ల‌తో సెకండ్ ఫ్లేస్ లో ఉన్నాడు. 


తుది జట్లు ఇవే..


ఆర్ఆర్ జట్టు:
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్


ఎంఐ జ‌ట్టు: 
ఇషాన్ కిష‌న్(వికెట్ కీప‌ర్), రోహిత్ శ‌ర్మ‌, న‌మ‌న్ ధిర్, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, ఆకాశ్ మ‌ధ్వాల్, జ‌స్ప్రీత్ బుమ్రా, క్వెనా మ‌ఫాకా.

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook