IPL 2024 RCB vs CSK: ఐపీఎల్ 2024 నాలుగో ప్లే ఆఫ్ బెర్త్ ఎవరికి, చెన్నై వర్సెస్ బెంగళూరులో ఎవరికెన్నిఅవకాశాలు
IPL 2024 RCB vs CSK Playoffs Chances: ఐపీఎల్ 2024 సీజన్ 17 మరో వారం రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే మూడు ప్లే ఆఫ్ బెర్త్‌లు ఖరారు కాగా చివరి బెర్త్ కోసం రెండు దక్షిణాది జట్లు పోటీ పడనున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో ఎవరికి ఎలాంటి అవకాశాలున్నాయో చూద్దాం.
IPL 2024 RCB vs CSK Playoffs Chances: ఐపీఎల్ 2024 సీజన్ 17లో ఇవాళ బెంగళూరు వేదికగా కీలకమైన మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం. నాలుగో ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసే మ్యాచ్ ఇది. ప్లే ఆఫ్ చేరేందుకు ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలున్నాయో చూద్దాం..
ఐపీఎల్ సీజన్ 17లో ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్‌లో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా ఇవాళ చివరి మ్యాచ్ ఆర్సీబీతో తలపడనుంది. మరోవైపు 12 పాయింట్లతో ఉన్న ఆర్సీబీకు కూడా ఇదే చివరి మ్యాచ్. అంటే ఇవాళ జరిగే మ్యాచ్‌లో చెన్నై ఓడితే రెండు జట్ల పాయింట్లు 14 చొప్పున సమమౌతాయి. అప్పుడు రన్‌రేట్ కీలకంగా మారనుంది. ఇప్పటి వరకైతే ఆర్సీబీ కంటే చెన్నై జట్టు రన్‌రేట్ అధికంగా ఉంది. అంటే ఇవాళ్టి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచినా రన్‌రేట్ ఆధారంగా ప్లే ఆఫ్ బెర్త్ ఖరారౌతుంది.
ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరాలంటే
ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాదించడమే కాకుండా రన్‌రేట్ మెరుగుపర్చుకోవాలి. చెన్నైతో పోలిస్తే ఆర్సీబీ రన్‌రేట్ 0.141 తక్కువగా ఉంది. దీనిని అధిగమించాలంటే ఆర్సీబీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించాలి. అదే చెన్నై మొదట బ్యాటింగ్ చేస్తే నిర్దేశిత లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలుండగానే ఛేదించాల్సి వస్తుంది. ఈ అన్ని సమీకరణాలకు మించి ఆర్సీబీ వరుణుడిని ప్రార్ధించుకోవాలి. వర్ధం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ ఇక ఇంటికే.
సీఎస్కే ప్లే ఆఫ్ చేరాలంటే
ప్లే ఆఫ్ చేరేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు పెద్ద సమీకరణాలేవీ లేవు. కేవలం ఆర్సీబీపై గెలిస్తే చాలు. ఇప్పటికే 14 పాయింట్లతో ఉన్న జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే 16 పాయింట్లతో ఏ సమీకరణాలు లేకుండానే ప్లే ఆఫ్ చేరుతుంది. అదే సమయంలో వర్షంకారణంగా మ్యాచ్ రద్దయినా వచ్చే ఒక పాయింట్‌తో 15 పాయింట్లు దక్కించుకుని ప్లే ఆఫ్ చేరుతుంది.
వాతావరణం ఎలా ఉంది
ఇవాళ్టి మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా వరుణుడు మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రతికూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ బెంగళూరు నగరంలో భారీ వర్ష సూచన ఉంది. అందుకే ఆర్సీబీలో టెన్షన్ ప్రారంభమైంది.
Also read: IPL MI vs LSG: ముంబై ఇండియన్స్ అట్టర్ ప్లాప్ షో.. ఆఖరి మ్యాచ్‌లోనూ లక్నో చేతిలో చిత్తు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook