Pat Cummins on SRH: ఐపీఎల్ 2024 సీజన్ 17 టైటిల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్తగా బరిలో దిగనుంది. ప్రపంచకప్ హీరో, ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెడీ అయింది. టోర్నీ ఛాంపియన్‌గా నిలిచేందుకు సరికొత్త ప్రణాళికలత, పటిష్టమైన ఆటగాళ్లతో సంసిద్ధమౌతున్నామని కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి కెప్టెన్ మార్చింది. వరుసగా 2-3 సీజన్ల నుంచి పేలవంగా రాణిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి వేలంలో తెలివిగా వ్యవహరించింది. ప్రపంచకప్ హీరోలు, ఆస్ట్రేలియా క్రికెటర్లైన ప్యాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్‌లను సొంతం చేసుకుంది. 20 కోట్లు పోసి కొనుగోలు చేసుకున్న ప్యాట్ కమిన్స్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. మార్చ్ 23 అంటే శనివారం మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. కొత్త కెప్టెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి జట్టులోనూ, అభిమానుల్లోనూ జోష్ నింపాడు.



ఐపీఎల్ 2024 సీజన్‌ను దూకుడుగా ప్రారంభించనున్నామని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మంచి జట్టని అయినా జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాలని చూస్తున్నానన్నారు. తనకు పరిచయం లేని ఆటగాళ్లతో కూడా సన్నిహితంగా ఉంటానని, తననుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకుంటానన్నారు జట్టులో భువనేశ్వర్ కుమార్, ఎయిడెన్ మార్క్‌రమ్ వంటి అనుభవజ్ఞులున్నారని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. అభిషేక్ శర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి వాళ్లను చూసి ఆనందంగా ఉందన్నాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి ఆటతీరు కనబరుస్తుందని తెలిపాడు. మొదట్నించే దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాలనేదే తమ వ్యూహమన్నారు. 


ఐపీఎల్ 2023 సీజన్ 16లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోరమైన ప్రదర్శన కనబర్చింది. 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. పాట్ కమిన్స్ రాకతో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రేవిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్, వానిందు హసరంగ, హెన్రిచ్ క్లాసెన్ వంటి అద్భుతమైన విదేశీ ఆటగాళ్లున్నారు. 


Also read: Water Crisis: ఐపీఎల్ మ్యాచ్‌లను వెంటాడుతున్న నీటి కష్టాలు.. అక్కడి మ్యాచులకు శుద్ధి చేసిన నీరు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook