IPL 2024-KKR: ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు నుంచి ఇంగ్లండ్ పేసర్  గస్ అట్కిన్సన్ తప్పుకున్నాడు. అతడిని ఈ సీజన్ నుంచి ఎందుకు తప్పించారో తెలియరాలేదు.  అతడి స్థానంలో శ్రీలకం ప్లేయర్ దుష్యంత చమీరాను జట్టులోకి తీసుకుంది కేకేఆర్. అట్కిన్సన్ ను కోటి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కేకేఆర్.. రూ. 50 లక్షల రిజర్వ్ ధరతో దుష్మంత చమీరను దక్కించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుష్మంత చమీర కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. గతంలో చమీర మూడో ఐపీఎల్ సీజనల్లలో వివిధ జట్లకు ఆడాడు. 2018లో రాజస్థాన్ రాయల్స్, 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2022లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తరుపున ఆడాడు చమీర. 2023 డిసెంబరు 19న దుబాయ్ వేదికగా జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో అట్కిన్సన్ ను కేకేఆర్ దక్కించుకుంది. ఇతడు ఇంగ్లండ్ తరపున 9 వన్డేలు, 3 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు.


కేకేఆర్ జట్టు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా (వైస్ కెప్టెన్), జాసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (WK), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, KS భరత్ (WK), మనీష్ పాండే, షకీబ్ అల్ హసన్. , షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ, ముజీబ్ ఉర్ రెహమాన్.



Also Read: రాజ్‌కోట్‌ మనదే.. ఇంగ్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా..


Also Read: ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోసిన యశస్వి.. వరుసగా రెండో డబుల్ సెంచరీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి