IPL 2024: మాంచి ఊపు మీదున్న రాహుల్ సేనకు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ పేసర్ ఔట్.. కారణం ఇదే..!
IPL 2024 Updates: ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే లక్నో స్టార్ పేసర్ ఐపీఎల్ మెుత్తానికి దూరమయ్యాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు? అసలు ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది?. పూర్తి సమాచారం మీ కోసం.
Shivam Mavi ruled out of IPL 2024: ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఐపీఎల్ పాయింట్ల టేబుల్ లో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే మాంచి ఊపు మీదున్న లక్నోకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ శివమ్ మావి గాయంతో టోర్నీ మెుత్తానికి దూరమయ్యాడు.
గత ఏడాది ఆగస్టు నుంచి గాయంతో బాధపడుతున్న శివమ్.. లీగ్ ప్రారంభం నాటికి కోలుకుంటాడని జట్టు మేనెజ్మెంట్ భావించింది. అయితే అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే లీగ్ మెుత్తానికి దూరమయ్యాడు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన మినీ వేలంతో ఇతడిని లక్నో జట్టు రూ. 6.4 కోట్లకు కొనుగోలు చేసింది. అవేష్ ఖాన్ స్థానంలో ఇతడిని తీసుకుంది. తాజాగా ఐపీఎల్ నుంచి శివమ్ తప్పుకున్నాడని లక్నో ఫ్రాంచైజీ మీడియాకు తెలియజేసింది. మావి లేకపోవడం రాహుల్ సేనకు కాస్త ఇబ్బందనే చెప్పాలి.
"నేను ఐపీఎల్ చాలా మిస్ అవుతాను. నా జట్టు కోసం మ్యాచ్‌లు ఆడాలని అనుకున్నాను. అయితే గాయం కారణంగా టోర్నీ నిష్క్రమించవలసి వస్తున్నందుకు బాధగా ఉంది. అయితే మా జట్టు గెలుస్తుందని భావిస్తున్నాను'' అని శివమ్ అన్నాడు. అతడు చివరిగా ఆగస్టు 2023లో మ్యాచ్ ఆడాడు.
Also Read: వైజాగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్.. కేకేఆర్, డీసీ జట్ల ఫ్లేయింగ్ 11 ఇదే
లక్నో సూపర్‌జెయింట్స్ టీమ్:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్‌వీర్ సింగ్, ప్రేరా మాన్కా. యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతమ్, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్ అర్షద్ ఖాన్.
Also Read: Ishan Kishan: సూపర్ మ్యాన్ గెటప్ లో ఇషాన్ కిషన్.. కారణం తెలిస్తే నవ్వు రాక మానదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి