IPL 2025 Kavya Maran Strategy: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొదటి రోజు ఆటగాళ్లు భారీ ధరలకే అమ్ముడయ్యారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిసి 467.95 కోట్లు ఖర్చు పెట్టాయి. 72 మంది ఆటగాళ్లను కొనుగోలుచేశాయి. రిషభ్ పంత్ అత్యధికంగా 27 కోట్లకు అమ్ముడవగా, పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు విక్రయమయ్యారు. వెంకటేశ్ అయ్యర్ కూడా 23.75 కోట్ల భారీ ధర పలికాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదటి రోజు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి 8 మందిని కొనుగోలు చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి బౌలింగ్ లైనప్ పటిష్టంగా చేసుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అర్షదీప్ సింగ్ కోసం గట్టిగా ప్రయత్నించింది. కానీ ఆర్‌టీఎం కార్డుతో పంజాబ్ కింగ్స్ జట్టే దక్కించుకుంది. ఆ తరువాత మొహమ్మద్ షమీని 10 కోట్లు, హర్షల్ పటేల్ 8 కోట్లు, రాహుల్ చాహర్ 3.20 కోట్లు, ఆడమ్ జంపా 2.40 కోట్లు, సిమర్‌జీత్ సింగ్ 1.50 కోట్లకు దక్కించుకుని బౌలింగ్ పటిష్ట చేసుకుంది. బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మార్చుకునేందుకు హిట్టర్ ఇషాన్ కిషన్‌ను 11.25 కోట్లు, ఫినిషర్ అభినవ్ మనోహర్‌ను 3.20 కోట్లకు దక్కించుకుంది. మొత్తానికి వేలంలో 45 కోట్లతో బరిలో దిగిన కావ్య పాప ఆచితూచి వ్యవహరించి నాణ్యమైన ఆటగాళ్లను దక్కించుకుంది. 


ఇవాళ జరగనున్న రెండో రోజు వేలానికి 5.15 కోట్లతో రంగంలో దిగనుంది. ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్‌కు ఇద్దరు విదేశీ ఆటగాళ్లు, మిడిలార్డర్ బలోపేతానికి కొందరు బ్యాటర్లు అవసరం. ఒక ఆఫ్ స్పిన్నర్ కోసం ప్రయత్నించవచ్చు. కానీ కేవలం 5.15 కోట్ల డబ్బుతో ఎంత వరకూ సాధ్యమౌతుందో చూడాలి. గత సీజన్లలో వేలంలో దూకుడుగా వ్యవహరిస్తూ కన్పించిన కావ్య మారన్ ఈసారి భిన్నంగా కన్పిస్తోంది. ఒకటికి రెండు సార్లు ఆలోచించి వేలం పాడుతోంది. 


Also read: IPL 2025 Auction: తొలి రోజు వేలం తరువాత ఏ జట్టు వద్ద ఎంత మిగిలింది, ఎవరెవరు ఆటగాళ్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.