IPL 2025 Auction: తొలి రోజు వేలం తరువాత ఏ జట్టు వద్ద ఎంత మిగిలింది, ఎవరెవరు ఆటగాళ్లు
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తొలిరోజు ముగిసింది. ఊహించినట్టే స్టార్ ఆటగాళ్లకు రికార్డు స్థాయి ధర దక్కింది. కొందరు ఆటగాళ్ల కోసం గతంలో ఎన్నడూ లేనంత పోటీ కన్పించింది. వేలం రసవత్తరంగా సాగింది. మొదటి రోజు వేలం తరువాత ఎవరి వద్ద ఎంత మిగిలింది, ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేసిందో చెక్ చెద్దాం.
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. రైట్ టు మ్యాచ్ కార్డు కొందరు ఆటగాళ్ల దశ మార్చేసింది. హోరాహోరీగా సాగిన వేలంలో ఆటగాళ్లు రికార్డు స్థాయి ధర దక్కించుకున్నారు. డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో వంటి ఆటగాళ్లపై ఎవరూ ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.
సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజు చాలా పోటీ కన్పించింది. ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. ఊహించినట్టే శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లకు భారీ ధర దక్కింది. మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, జేక్ ఫ్రేజర్ వంటి ఆటగాళ్లకు ఆశించిన మొత్తం లభించింది. వెంకటేశ్ అయ్యర్ వంటి ఆటగాళ్లకు ఎవరూ ఊహించని డబ్బు లభించింది. మొదటి రోజు వేలంలో 84 మంది ఆటగాళ్లు వేలానికి రాగా 72 మంది అమ్ముడుపోయారు. 12 మంది అన్‌సోల్డ్‌గా మిగిలారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు తొలిరోజు వేలంలో 467.95 కోట్లు ఖర్చు పెట్టారు. తొలిరోజు వేలంలో పంజాబ్ కింగ్స్ అత్యధికంగా 10మందిని భారీ ధరలకు కొనుగోలు చేసింది.
మొదటి రోజు వేలం తరువాత ఆర్సీబీ వద్ద అత్యధికంగా 30.65 కోట్లు మిగిలితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వద్ద అత్యల్పంగా కేవలం 5.15 కోట్లు మిగిలాయి. ఇక ముంబై ఇండియన్స్ జట్టు వద్ద 26.10 కోట్లు, పంజాబ్ కింగ్స్ వద్ద 22.50 కోట్లు, గుజరాత్ టైటాన్స్ వద్ద 17.50 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద 17.35 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 15.60 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ వద్ద 14.85 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద 13.80 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ వద్ద 10.05 కోట్లు మిగిలాయి.
ఏ ఫ్రాంచైజీలో ఎవరెవరు ఆటగాళ్లు
పంజాబ్ కింగ్స్ లెవెన్- శ్రేయస్ అయ్యర్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చాహల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ మనోహర్, వథేరా, ప్రభ్ సిమ్రన్, వైశాఖ్, యశ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్
లక్నో సూపర్ జెయింట్స్-రిషభ్ పంత్, నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, అయుష్ బదోని, మొహిసిన్ ఖాన్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రమ్, జుయల్
కోల్‌కతా నైట్‌రైడర్స్ - వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, నోకియా, హర్షిత్ రాణా, క్వింటన్ డికాక్, రఘువంశీ, రమణదీప్ , మయాంక్ మార్కండే, గుర్బాజ్ , వైభవ్
రాజస్థాన్ రాయల్స్ - సంజూ శాంసన్, యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, హిట్ మెయిర్, హసరంగ, మహీశ తీక్షణ, సందీప్ శర్మ, మధ్వాల్, కుమార్ కార్తికేయ సింగ్
చెన్నై సూపర్‌కింగ్స్- రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శివం దూబే, నూర్ అహ్మద్, పతిరణ, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, డేవన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- విరాట్ కోహ్లీ, హేజిల్ వుడ్, రజత్ పాటిదార్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లివింగ్‌స్టోన్, రసిఖ్, యశ్ దయాల్, సుయాశ్
ఢిల్లీ కేపిటల్స్- కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మెక్‌గుర్క్, నటరాజన్, స్టబ్స్, హ్యారీ బ్రూక్, అశుతోష్, పోరెల్, మోహిత్ శర్మ, కరుణ్ నాయర్, రిజ్వీ
గుజరాత్ టైటాన్స్-శుభమన్ గిల్, రషీద్ ఖాన్, జోస్ బట్లర్, రబాడ, సాయి సుదర్శన్, మొహమ్మద్ సిరాజ్, షారుఖ్ ఖాన్, ప్రసిద్ధ క్రిష్ణ, అనూజ్ రావత్, మానవ్, లోమ్రోర్, నిషాంత్, కుషాగ్రా
సన్‌రైజర్స్ హైదరాబాద్-ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ,స ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమీ, రాహుల్ చాహర్, ఆడం జంపా, అధర్వ, సిమర్ జీత్
ముంబై ఇండియన్స్-హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బూమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్, సమన్ ధీర్, రాబిన్ మింజ్, కరణ్ శర్మ.
Also read: IPL 2025 Mega Auction: లక్నో సూపర్ జెయింట్స్‌తో భారీగా ఖర్చు పెట్టించిన కావ్య పాప
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.